పర్యాటకులను ఆకర్షిస్తున్న గొల్లవాగు ప్రాజెక్టు
ABN , Publish Date - Sep 16 , 2024 | 10:53 PM
మండల కేంద్రంలో ఉన్న గొల్లవాగు ప్రాజెక్టు పర్యా టకులను ఆకర్షిస్తుంది. మండల కేంద్రం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో గొల్లవాగు ప్రాజెక్టును 18 సంవత్సరాల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంతో జల వనరులు పెరిగి వ్యవసాయ మండ లంగా పేరుగాంచింది. వర్షాకాలంలో సం దర్శకుల తాకిడితో గొల్లవాగు ప్రాజెక్టు నిత్యం ప్రజలతో కళకళాడుతుంది.
భీమారం, సెప్టెంబరు 16 : మండల కేంద్రంలో ఉన్న గొల్లవాగు ప్రాజెక్టు పర్యా టకులను ఆకర్షిస్తుంది. మండల కేంద్రం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో గొల్లవాగు ప్రాజెక్టును 18 సంవత్సరాల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు నిర్మాణంతో జల వనరులు పెరిగి వ్యవసాయ మండ లంగా పేరుగాంచింది. వర్షాకాలంలో సం దర్శకుల తాకిడితో గొల్లవాగు ప్రాజెక్టు నిత్యం ప్రజలతో కళకళాడుతుంది. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు మత్తడి దూకుతుంది.
ఒక పక్క కొండలు, వృక్షాలు ప్రాజె క్టును ఆనుకుని ఉండడం వల్ల ప్రాజెక్టు పూర్తిగా ప్రకృతి ఒడిలో ఉంది. ప్రాజెక్టు కింద మామిడి తోటలు, పొలాలు చూ స్తూ ఉంటే కనువిందు చేస్తుంది. ప్రాజె క్టుని ఆనుకుని అటవీ ప్రాంతం ఉండ డంతో అటవీ శాఖ అధికారులు బర్డ్ వాచింగ్ దృశ్యాలను కెమెరాలో బంధి స్తుంటారు. అలాగే ప్రాజెక్టు ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు గజిబో అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ గజిబో కేంద్రం నుంచి వివిధ జాతుల పక్షులు, జంతువులను వీక్షిస్తుంటారు. గొల్లవాగు ప్రాజెక్టు పూర్తిగా ప్రకృతి ఒడిలో ఉండడం వల్ల చుట్టూ చెట్లు మధ్యలో ప్రాజెక్టు ఉండడంతో ప్రాజెక్టు నుంచి దూకుతున్న నీరు జాలువారుతూ అందంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రాజె క్టును పర్యాటక కేంద్రంగా చేస్తే ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు ఆదా యం కూడా వస్తుంది.
ప్రాజెక్టుకు చేరుకోవడం ఇలా...
భీమారం ఆవడం క్రాస్‌రోడ్డు వద్ద దిగి నెన్నెల రోడ్డు మీదుగా సుమారు రెండు న్నర కిలోమీటర్ల దూరంలో మామిడి తోటల మధ్య నుంచి వెళితే గొల్ల ప్రాజెక్టు కనబడుతుంది. గొల్లవాగు ప్రాజెక్టు ఖాజీ పల్లి సమీపంలో గల పెద్దవాగు నుంచి ప్రారంభమై నర్సింగాపూర్ గ్రామం మీదు గా వచ్చే చిన్న వాగుతో కలిసి బూరు గుపల్లి వద్ద నుంచి వచ్చే మరో వాగుతో కలిసి ఒక ప్రాంతంలో మిళితమై వాగుగా ఏర్పడుతుంది. గొల్లవాగు ప్రాజెక్టును చూ డడానికి వచ్చిన వారు ఇక్కడే విందు చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతున్నా రు. కానీ ప్రాజెక్టు వద్ద రోడ్డు బురదమ యంగా ఉండడంతో సందర్శకులు ఇబ్బం దులు పడుతున్నారు.