నాణ్యమైన ధాన్యం తీసుకవచ్చి మద్దతు ధర పొందాలి
ABN , Publish Date - Dec 26 , 2024 | 10:52 PM
నాణ్యమైన ధాన్యం కొను గోలు కేంద్రాలకు తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని డీఆర్‌డీఏ డీపీఎం వేణుగోపాల్ సూచించారు. నెల్కివెంకటాపూర్, మదాపూర్, ధర్మరావుపేట, పెద్దపేట, లక్ష్మికాంతపూర్ గ్రామాల్లో గురువారం కేంద్రాలను సందర్శిం చారు.
దండేపల్లి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నాణ్యమైన ధాన్యం కొను గోలు కేంద్రాలకు తీసుకవచ్చి మద్దతు ధర పొందాలని డీఆర్‌డీఏ డీపీఎం వేణుగోపాల్ సూచించారు. నెల్కివెంకటాపూర్, మదాపూర్, ధర్మరావుపేట, పెద్దపేట, లక్ష్మికాంతపూర్ గ్రామాల్లో గురువారం కేంద్రాలను సందర్శిం చారు.
ఆయన మాట్లాడుతూ దళారులకు ధాన్యం విక్రయించి నష్టపో వద్దని, ప్రభుత్వం మద్దతు ధరతోపాటు సన్నరకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తుందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. తూకం వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌మిల్లుకు తర లించాలన్నారు. ఐకేపీ సీఏ మూల తిరుపతిగౌడ్, గ్రామైఖ్య సంఘాల లీడర్లు, వివోఏలు, ఉన్నారు.