మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట
ABN , Publish Date - Sep 28 , 2024 | 10:34 PM
మహిళల అభ్యు న్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాలక్ష్మీ లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని నెర వేరుస్తున్నారన్నారు.
చెన్నూరు, సెప్టెంబరు 28: మహిళల అభ్యు న్నతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహాలక్ష్మీ లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం అన్ని నెర వేరుస్తున్నారన్నారు. చెన్నూరులో వంద పడ కల ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభి స్తామన్నారు. అనంతరం 70 మంది లబ్ధిదారు లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందిం చారు. తహసీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, వైస్ చైర్మన్ నవాజుద్దీన్, కౌన్సిలర్‌లు శంకర్, మహేష్, శ్రీనివాస్, శైలజ, సురేఖ, శ్రీనివాస్, నాయకులు సూర్యనారా యణ, కరుణాసాగర్‌రావు, రాంరెడ్డి, ఫయాజు ద్దీన్, హేమంతరెడ్డి, పాల్గొన్నారు.
క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన చెక్కు ల పంపిణీకి కాంగ్రెస్ నాయకులు హాజరుకా లేదు. జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డి, కోటపల్లి మాజీ పీఏసీఎస్ చైర్మన్ గొడిసెల బాపురెడ్డితోపాటు వారి అనుచరులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
జైపూర్: ఆరు గ్యారంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వివేక్‌వెం కటస్వామి పేర్కొన్నారు. ఎంపీడీవో కార్యాల యంలో మహాలక్ష్మీ పథకం ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల లబ్ధిదారులకు సబ్సిడీ ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడు తూ అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభు త్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. అనంత రం పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. తహసీ ల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనా రాయణ, ఎంపీవో శ్రీపతి బాపురావు, నాయకులు రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, ఫయాజ్, సత్యనారాయణరెడ్డి, విశ్వంభర్‌రెడ్డి పాల్గొన్నారు.
భీమారం: పేదల కళ్లలో ఆనందమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. రైతు వేదికలో మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ ధ్రువీకరణ పత్రాలను అందజే శారు. ఎమ్మెల్యే మాట్లాడు తూ మండలానికి చెందిన 2672 మందికి గ్యాస్ ధ్రువపత్రాలను అందజేశామన్నారు. అర్హులైన వారికి ఇం దిరమ్మ ఇండ్లను త్వరలోనే అందిస్తామన్నారు. ఆరుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. స్పెషల్ ఆఫీసర్ కల్పన, నాయకులు చేకుర్తి సత్యనారాయణరెడ్డి, పోడేటి రవి పాల్గొన్నారు.