Share News

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Oct 28 , 2024 | 10:47 PM

ఆదివాసి గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ కోట్నాక తిరుపతి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జపటేల్‌లు అన్నారు. గుడిరేవులో పద్మల్‌పూరీ కాకో ఆలయంలో సోమవారం నిర్వహించిన గుస్సాడి దర్బార్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మట్లాడారు.

గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

దండేపల్లి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆదివాసి గిరిజనుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన కోఆపరేటివ్‌ ఫైనాన్స్‌ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ కోట్నాక తిరుపతి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జపటేల్‌లు అన్నారు. గుడిరేవులో పద్మల్‌పూరీ కాకో ఆలయంలో సోమవారం నిర్వహించిన గుస్సాడి దర్బార్‌ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మట్లాడారు. ముందుగా ఆలయ కమిటీ ఆఽధ్వర్యంలో గిరిజన సంప్రదాయబద్దంగా డప్పుచప్పులతో గుస్సాడి వేషధారణతో స్వాగతం పలికారు. వారు మాట్లాడుతూ ఆదివాసి సంప్రదాయలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుతూ వాటిని పాటించడంలో ఆదివాసిలు ప్రత్యేకంగా నిలుస్తారన్నారు. గిరిజన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడేది గిరిజనులేనన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ సోము, మాజీ సర్పంచులు మంజుభార్గవి, లింగవ్వ నాయకులు తిరుపతి, మంజుల, ఆలయ కమిటీ సభ్యులు ఆదివాసి గిరిజన నాయకులు పాల్గొన్నారు.

ప్రతి దండారీకి రూ. 15 వేలు

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు ప్రాజెక్టు పరిధిలోని ప్రతీ దండారికి రూ.15 వేల చొప్పున కేటాయించామని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు ప్రాజెక్టు అధికారి ఖుష్బూగుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. ఉట్నూరు పరిధిలోని వెయ్యి గ్రామాల్లో దండారికి రూ.15 వేల చొప్పున ప్రభుత్వం రూ. 1.50 కోట్లు దీపావకళి కానుకగా కేటాయించిందన్నారు.

Updated Date - Oct 28 , 2024 | 10:47 PM