మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Nov 11 , 2024 | 10:36 PM
మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి అన్నారు. సోమవారం బోయపల్లి పెద్ద చెరువులో అధికారులతో కలిసి 9 వేల చేప పిల్లలను వదిలారు. ఆయన మాట్లాడుతూ చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
తాండూర్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మత్య్సకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి అన్నారు. సోమవారం బోయపల్లి పెద్ద చెరువులో అధికారులతో కలిసి 9 వేల చేప పిల్లలను వదిలారు. ఆయన మాట్లాడుతూ చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఈసా, నాయకులు రవీందర్‌రెడ్డి, సిరంగి శంకర్, మహేందర్‌రావు, సాలిగాం బానయ్య, శ్రీనివాస్,వేణు, మత్య్స సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలతో ప్రజలకు లబ్ధి
బెల్లంపల్లి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలతో ప్రతీ కుటుంబం లబ్ధి పొందుతుందని ఎమ్మెల్యే వినోద్ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ముందుకు వెళ్తున్నారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరయ్యాయని, తాగునీటి సమస్య, రహదారుల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. నాతరి స్వామి, బండి ప్రభాకర్, నీలి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.