Share News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:02 PM

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హైద్రాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా మద్దతు ధర నిర్ణయించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోందని, జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ప్రారంభించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం హైద్రాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా మద్దతు ధర నిర్ణయించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోందని, జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆర్‌పీఎం 18 నుంచి 20 వరకు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సన్నరకం వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్‌ అందిస్తుందని, ఈ క్రమంలో సన్నరకం, దొడ్డు రకం వడ్ల సేకరణకు వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలో గుర్తించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, కేంద్రాలకు అవసరమైన యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరు పౌర హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ప్రతీ ఒక్కరు పౌర హక్కులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో డీసీపీ భాస్కర్‌, అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అట్రాసిటీ పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ బాధితులకు సత్వర న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామాల్లో సివిల్‌ రైట్స్‌ డే సందర్భంగా నిర్వహించే సభల్లో అధికారులు హాజరయ్యేలా చూడాలని, ఆర్డీవో పర్యవేక్షించాలని పేర్కొన్నారు. కళాజాత ద్వారా సివిల్‌ రైట్స్‌డే, పౌర హక్కులు, అట్రాసిటీ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. డీసీపీ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు విచారణతోపాటు ఎఫ్‌ఐఆర్‌ ప్రక్రియ వేగవంతం చేసేందుకు సంబంధిత ఎస్‌హెచ్‌వోలు, సీఐ, ఎస్‌ఐల సమన్వయంతో విచారణ ప్రక్రియ వేగంగా జరుపుతామన్నారు. ఏసీపీలు ప్రకాష్‌, రవికుమార్‌, వెంకటేశ్వర్లు, జిల్లా షెడ్యూల్డు కులాల ఉప సంచాలకులు పోటు రవీందర్‌రెడ్డి, విజిలెన్స్‌ మానిటరింగ్‌ సభ్యులు వెంకటేశం, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 11:02 PM