భక్తులతో పోటెత్తిన గూడెం ఆలయం
ABN , Publish Date - Nov 03 , 2024 | 10:37 PM
కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 25వేల మందిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు.
దండేపల్లి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు 25వేల మందిపైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారు. కార్తీక ఉత్సవాల్లో భాగంగా దేవాలయంలోని అగ్నిప్రతిష్ఠ, హవణము బలిహరణము, తీర్ధ ప్రసాద వితరణ కార్యక్రమాలను యజ్ఞనచార్యులు అభిరాముచార్యులు ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్ధాపక కుటుంబసభ్యులు గోవర్ధన రఘస్వామి, సంపత్‌స్వామి, అర్చకుల ఆధ్వర్యంలో వేద మంతోచ్ఛరణల మధ్య వైభవంగా నిర్వహించారు.
సమీప గోదావరి నదిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం ఆలయానికి చేరుకొని సత్యదేవున్ని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని రావి చెట్టు, ప్రధానాలయం ఎదుట ధ్వజస్తంభం వద్ద ఉసిరి కాయలతో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, లక్షెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్, ఎస్సై సాంబమూర్తి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.