Share News

నర్సరీల బాధ్యతల నుంచి తప్పించాలి

ABN , Publish Date - Oct 07 , 2024 | 10:43 PM

నర్సరీల బాధ్యతల నుంచి తమను తప్పించాలని సోమవారం డీఆర్‌డీఏ పీడీ కిషన్‌కు కార్యదర్శులు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అప్పులు చేస్తూ పంచాయతీలను నడుపుతున్నామన్నారు.

నర్సరీల బాధ్యతల నుంచి తప్పించాలి

కోటపల్లి, అక్టోబరు 7: నర్సరీల బాధ్యతల నుంచి తమను తప్పించాలని సోమవారం డీఆర్‌డీఏ పీడీ కిషన్‌కు కార్యదర్శులు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీలకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో అప్పులు చేస్తూ పంచాయతీలను నడుపుతున్నామన్నారు.

పంచాయతీల నిర్వహణ ఇప్పటికే భారం అవుతుండగా నర్సరీలను ఏర్పాటు చేయాలని మండల అధికారులు ఆదేశించారన్నారు. ఎర్రమట్టి, ఇసుక, ఎరువు, ప్రైమరీ బెడ్‌ల కోసం సిమెంటు, రింగులు, విత్తనాలు, నీటి సౌకర్యం, భూమి రెంటు, గ్రీన్‌ షెడ్‌ నెట్‌ తదితర కొనుగోలుకు ఖర్చులు కార్యదర్శులే భరించాల్సి వస్తుందన్నారు. నర్సరీల బాధ్యతల నుంచి తమను తప్పించి ఉపాధిహామీ సిబ్బందికి అందించాలని కోరారు.

Updated Date - Oct 07 , 2024 | 10:43 PM