Share News

Nirmal Dist.: కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు

ABN , Publish Date - Dec 29 , 2024 | 08:35 AM

నిర్మల్ జిల్లా: అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా, దిలావర్ పూర్‌లోని కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు చెబుతుండడంతో పిల్లలను తల్లిదండ్రులు వారి ఇళ్లకు తీసుకువెళుతున్నారు.

Nirmal Dist.: కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకలి కేకలు
Kasturba Girls Ashram School

నిర్మల్ జిల్లా: అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. తాజాగా నిర్మల్ జిల్లా (Nirmal Dist.), దిలావర్ పూర్‌ (Dilawarpur) లోని కస్తూరిభా బాలికల ఆశ్రమ పాఠశాలలో (Kasturba Girls Ashram School ) ఆకలి కేకలు (Hunger cries) మిన్నంటుతున్నాయి. భోజనం సరిగా పెట్టడం లేదని విద్యార్థులు చెబుతుండడంతో పిల్లలను తల్లిదండ్రులు వారి ఇళ్లకు తీసుకువెళుతున్నారు. కొంతకాలంగా ఆశ్రమ పాఠశాలలో సరైన ఆహారం అందించడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో బాలికలు తమ తల్లి దండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో తల్లిదండ్రులు ఆశ్రమ పాఠశాలకు చేరుకుని బాలికలను ఇళ్లకు తీసుకువెళ్లారు. పాఠశాలలో సరైన భోజనం పెట్టడంలేదని, చదువు కూడా చెప్పడంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఆహారం సరఫరా చేస్తున్న వారు సమ్మెలో ఉండడంతో అధికారులు ప్రత్యామ్నాయంగా బయటవారితో వంట చేయిస్తున్నారు. దీంతో ఉడికీ ఉడకని భోజనం, పురుగులు, నాసిరకం భోజనం తినలేక విద్యార్థులు నాలుగు రోజులుగా పస్తులుంటున్నారు. దీంతో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ ఉండలేకపోతున్నామని, భోజనం సరిగా లేదని, మాడిన, పురుగుల అన్నం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకువెళుతున్నారు.


మొత్తం పాఠశాలలో 360 బాలికలు చదువుతున్నారు. ఇప్పటి వరకు 220 మంది బాలికలు తమ ఇళ్లకు వెళ్లి పోయారు. మిగిలిన బాలికలు కూడా ఆదివారం వెళ్లిపోవడానికి సిద్ధమవుతున్నారు. కాగా సిబ్బంది సమ్మె లో ఉండటం వల్లనే ఈ సమస్య తలెత్తినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని, ఇక్కడే ఉండాలని విద్యార్థులకు నచ్చజెప్పినా వారు వినలేదు. మరోవైపు ఉపాధ్యాయుల సమ్మెతో రెండు వారాల నుంచి చదువులు నిలిచిపోయాయి. సరైన భోజనం కూడా లేదు.. ఈ క్రమంలోఇక్కడే ఉండే ఆరోగ్యం దెబ్బతింటుందని విద్యార్థులు చెబుతున్నారు. పిల్లలు ఇలాగే కొన్ని రోజులు ఉంటే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతూ తమ పిల్లలను తీసుకువెళుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాకినాడలోని స్టెల్లా షిప్‌కు మోక్షం..

ఘోర విమాన ప్రమాదం.. 28 మంది స్పాట్ డెడ్

తారలు.. దిగివచ్చిన వేళ..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 29 , 2024 | 08:35 AM