Share News

పోలింగ్‌ కేంద్రాలపై అభ్యంతరాలుంటే తెలుపాలి

ABN , Publish Date - Dec 12 , 2024 | 11:00 PM

డ్రాఫ్ట్‌ పోలింగ్‌ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఎంపీడీవో సత్యనారా యణసింగ్‌ అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాల జాబితాను విడుదల చేశామన్నారు.

పోలింగ్‌ కేంద్రాలపై అభ్యంతరాలుంటే తెలుపాలి

కాసిపేట, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): డ్రాఫ్ట్‌ పోలింగ్‌ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలుంటే తెలియజేయాలని ఎంపీడీవో సత్యనారా యణసింగ్‌ అన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాల జాబితాను విడుదల చేశామన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్‌, బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు వాసుదేవ్‌, పార్టీల నాయకులు జనార్దన్‌రెడ్డి, రాజమౌళి, రమేష్‌, సాయికిరణ్‌ పాల్గొన్నారు.

కోటపల్లి, (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటులో అభ్యంత రాలుంటే తెలపాలని ఎంపీడీవో లక్ష్మయ్య కోరారు. గురువారం మం డల పరిషత్‌ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటుపై సమావేశం నిర్వహిం చారు. ఏదైన అభ్యంతరాలుంటే శుక్రవారం పరిష్కరిస్తామని, 17న తుది జాబితా ప్రచురిస్తామన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు.

Updated Date - Dec 12 , 2024 | 11:01 PM