పథకాల అమలు సమర్ధవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Nov 07 , 2024 | 10:41 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ సమీకృత పథకాల నిర్వహణ సమర్ధవంతంగా చేపట్టాలని దిశ చైర్మన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీఆర్‌డీవో కిషన్‌లతో కలిసి దిశ (డిస్టిక్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ త్రైమాసిక సమావేశానికి హాజరయ్యారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ సమీకృత పథకాల నిర్వహణ సమర్ధవంతంగా చేపట్టాలని దిశ చైర్మన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, డీఆర్‌డీవో కిషన్‌లతో కలిసి దిశ (డిస్టిక్ డెవలప్‌మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) జిల్లా అభివృద్ధి సమన్వయ పరిరక్షణ కమిటీ త్రైమాసిక సమావేశానికి హాజరయ్యారు. ఎంపీ మాట్లాడుతూ జాతీయ రహదారి 163లో భాగంగా ప్యాకేజీ 1లో 83 శాతంతో 31.4 కిలోమీటర్లు, ప్యాకేజీలో 2లో 9.8 కిలోమీటర్లు మొత్తం 164 ఎకరాల సేకరణ ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఎన్‌హెచ్ 363లో 42 కిలోమీటర్ల మంచిర్యాలలో జిల్లాలో పూర్తయి మెయిటెన్స్‌లో ఉందని, ఎన్‌హెచ్ 63లో భాగంగా 4వ దశలో 35 కిలోమీటర్లకు లక్షెట్టిపేట నుంచి మంచిర్యాల వరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు.
బొక్కల గుట్ట నుంచి మంచిర్యాల వరకు ఉన్న రోడ్డును మార్చి లోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 3 బస్తీ దవాఖానాలు, వంద పల్లె దవాఖానాలు, 149 ఆరోగ్య ఉపకే ంద్రాలు, 651 ఆశా కార్యకర్తల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్నామన్నారు. నేషనల్ హెల్త్‌మిషన్ కింద సబ్ సెంటర్లు అలోకేషన్‌కు రూ. 11 కోట్లు అవసరం ఉందని తెలిపారు. అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా సదరం శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నామన్నారు. ఆరు అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడేషన్‌కు ప్రతిపాదనలు పంపగా 2 పూర్తయ్యాయని తెలిపారు. రైతుల సంక్షేమానికి ఈ సీజన్‌లో 326 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 2024-25లో ఇప్పటి వరకు 93,932 మంది కూలీలకు పనులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఇందిర మహిళ శక్తిలో భాగంగా కిరాణం, సైకిల్ షాప్, మీసేవ, క్యాంటీన్‌లను ఏర్పాటు చేశామన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా రెండు విడతల్లో 2,216 రెండు పడక గదుల ఇండ్లను మంజూరు, ఇందులో 1,206 పూర్తి కాగా 96 ఇండ్లు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధత శాఖల అధికారులు పాల్గొన్నారు.