Share News

సరిహద్దు గ్రామాల్లో ‘మహా’ ఎన్నికల సందడి

ABN , Publish Date - Nov 20 , 2024 | 10:38 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాకు సరిహద్దున ఉండడం, అక్కడి ప్రజలు ఇక్కడ సత్సంబంధాలతో ఉన్నాయి. మహా రాష్ట్రకు చెందిన పలువురు కూలీలు తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఉపాధికి వస్తారు. దీంతో ఇక్కడి గ్రామాలు సందడిగా మారాయి. అంతే కాకుండా కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు సంబంధించి 12 గ్రామాల్లో ఓటర్లు ఉన్నారు.

సరిహద్దు గ్రామాల్లో  ‘మహా’ ఎన్నికల సందడి

మంచిర్యాల/ఆసిఫాబాద్‌/కెరమేరి, నవంబరు 20 (ఆంధ్ర జ్యోతి): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాకు సరిహద్దున ఉండడం, అక్కడి ప్రజలు ఇక్కడ సత్సంబంధాలతో ఉన్నాయి. మహా రాష్ట్రకు చెందిన పలువురు కూలీలు తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో ఉపాధికి వస్తారు. దీంతో ఇక్కడి గ్రామాలు సందడిగా మారాయి. అంతే కాకుండా కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాకు సంబంధించి 12 గ్రామాల్లో ఓటర్లు ఉన్నారు. ఈ నెల 18తో ఎన్నికల ప్రచారం ముగియగా 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు నిర్వహించారు. మావోయిస్టు ప్రాబల్య, సమస్యాత్మక కేంద్రాల్లో మధ్యా హ్నం 3 గంటల వరకే పోలింగ్‌ ముగించాల్సి ఉండగా, క్యూలో ఓటర్లు ఉండటంతో సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.

బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. మహాఘడ్‌ బంధన్‌ (బీజేపీ కూటమి), ఇండియా ఘడ్‌ బంధన్‌ (ఇండియా కూటమి) మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఓటర్లు కాంగ్రెస్‌ కూటమి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అలాగే పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో బీజేపీ కూటమికి కలిసి వస్తుందనే ప్రచారం సాగుతోంది. సిట్టింగ్‌ సీఎం ఎక్నాథ్‌ షిండే (బీజేపీ కూట మి) పథకం లాడ్లీ బహెన్‌ కింద మహిళలకు నెలకు రూ.1500 నాలుగు నెలలుగా అమలు చేస్తున్నారు. ఈ పథకం ఎన్నికల్లో లబ్ధి చేకూర్చిందనే అభిప్రాయాలు విని పిస్తున్నాయి. మహారాష్ట్రలో రెండు ప్రాంతీయ పార్టీలైన శివ్‌సేన, రాష్ట్రవాది పార్టీలు రెండు వర్గాలుగా చీలిపో యాయి. శివ్‌సేన అగ్రనేతలైన ఏక్నాథ్‌ షిండే బీజేపీ కూటమిలో ఉండగా ఉద్ధవ్‌ ఠాక్రే ఇండియా కూటమికి మద్దతు తెలిపారు. మరో ప్రాంతీయ పార్టీ రాష్ట్రవాది పార్టీ నేతలు అజిత్‌పవార్‌, శరత్‌ పవార్‌ సోదరులు రెండు వర్గాలుగా చీలిపోయి, రెండు కూటములకు ఒక్కొ క్కరు మద్దతు ప్రకటించారు. అజిత్‌ పవార్‌ బీజీపే వైపు, శరత్‌ పవార్‌ కాంగ్రెస్‌ వైపు నిలబడ్డారు.

అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద బందోబస్తు....

మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కోటపల్లి మండలం రాపన్‌పల్లి వద్ద ఏర్పాటు చేసిన అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద రామగుండం కమిషనరేట్‌ పరిధి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చెక్‌పోస్టులో ఇద్దరు ఎస్సైలతోపాటు సిబ్బందిని కేటాయించారు. రెండు రాష్ట్రాలను కలిపే ప్రాణహిత నది వంతెనపై నుంచి మహారాష్ట్రకు వెళ్లే వాహనాలను కొద్ది రోజులుగా తనిఖీ చేస్తున్నారు. సీపీ శ్రీనివాస్‌, మచిర్యాల డీసీపీ భాస్కర్‌ తరుచుగా చెక్‌పోస్టును సందర్శిస్తూ అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అక్రమంగా డబ్బు, మద్యం, ఇతర ఓటర్లను ప్రలోభ పరిచే వస్తువులపై నిఘా పెంచారు. ఇప్పటి వరకు సుమారు రూ.5 లక్షల విలువైన మద్యం పట్టుబడింది.

సరిహద్దు గ్రామాల్లో ప్రశాంతంగా పోలింగ్‌

తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద గ్రామాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలంలోని 12 గ్రామాలు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లా రాజురా నియోజకవర్గం జివితి తాలుకా పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాల ప్రజలు తెలంగాణ, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. కెరమెరి మండలంలోని పరందోళి, అంతాపూర్‌, మహారాజ్‌గూడ, శంకర్‌లొద్ది, ముక్దంగూడ, లెండిగూడ, గౌరి, పద్మావతి, ఈసాపూర్‌, ఇందిరానగర్‌, బోలాపటార్‌ గ్రామాల్లో మొత్తం 3034 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గతేడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికలతోపాటు మహారాష్ట్రలో ఏప్రిల్‌ 19న జరిగిన పార్ల మెంట్‌ ఎన్నికల్లో, ఆ తరువాత మే 13న తెలంగాణలో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో తాజాగా బుధవారం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయాగ్రామాల ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతిసారి రెండు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో ఓటువేసి ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటున్నారు.

ఓటు వేసిన 1650 మంది

మహారాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో జిల్లాపరిధిలోని పరం దోళి, అంతాపూర్‌ గ్రామాల్లో పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరందోళిలో 1422 మంది ఓటర్లకు గాను 735మంది, అంతాపూర్‌ పోలింగ్‌ కేంద్రాల్లో 1612 మంది ఓటర్లకు గాను 915మంది ఓటర్లు మొత్తం 1650 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 70 శాతం ఓటింగ్‌ నమోదైంది. చలితీవ్రత కారణంగా ఉద యం మందకొడిగా సాగిన పోలింగ్‌, ఆ తరువాత పోలింగ్‌ కేంద్రాలకు ఓటు వేసేందుకు ఓటర్లు పెద్దఎత్తున తరలివచ్చారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మహారాష్ట్ర ప్రభుత్వం పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ఏర్పాటు చేశారు.

Updated Date - Nov 20 , 2024 | 10:38 PM