Share News

చెన్నూరు, దండేపల్లిలో చెరువుల సర్వే

ABN , Publish Date - Sep 23 , 2024 | 10:38 PM

చెన్నూరు పట్టణం ఆస్నాద్‌ రోడ్డు ప్రాంతంలో ఉన్న కుమ్మరికుంట చెరువు సర్వేను సోమ వారం రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సంయుక్తగా సర్వే ప్రారంభించారు. సర్వే ప్రారంభంతో కుమ్మరికుంట బఫర్‌ జోన్‌లో నిర్మించుకున్న ఇంటి నిర్మాణదారులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు.

చెన్నూరు, దండేపల్లిలో  చెరువుల సర్వే

చెన్నూరు, సెప్టెంబరు 23: చెన్నూరు పట్టణం ఆస్నాద్‌ రోడ్డు ప్రాంతంలో ఉన్న కుమ్మరికుంట చెరువు సర్వేను సోమ వారం రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు సంయుక్తగా సర్వే ప్రారంభించారు. సర్వే ప్రారంభంతో కుమ్మరికుంట బఫర్‌ జోన్‌లో నిర్మించుకున్న ఇంటి నిర్మాణదారులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురవుతున్నారు. రెవెన్యూ రికా ర్డుల ప్రకారం కుమ్మరికుంట చెరువు 16.24 ఎకరాల విస్తీర్ణం లో విస్తరించి ఉండేది. చెన్నూరు పట్టణం రోజురోజుకు అభి వృద్ధి చెందుతుండడంతో కొన్నేళ్ళ నుంచి చెరువు శిఖం భూ ములు ఆక్రమణకు గురయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. శిఖం భూమి నుంచే మండలంలోని వివిధ గ్రామా లకు వెళ్లే రహదారి నిర్మాణం సైతం జరిగింది. కాగా ప్రధాన రహదారిని ఆనుకుని భవనాలు నిర్మించడంతో శిఖం భూమి 5, 6 ఎకరాలకే పరిమితమైంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు కుమ్మరికుంట శిఖం భూమిని 16.24 ఎకరాలను గుర్తించేం దుకు అధికారులు సర్వేకు శ్రీకారం చుట్టారు. కుమ్మరికుంట శిఖం హద్దులను గుర్తించేందుకు ఈ నెల 20న పలువురు ఇంటి యాజమానులకు నోటీసులు జారీ చేశారు. సర్వే సమ యంలో యజమానులు డాక్యుమెంట్లతో హాజరు కావాలని కోరారు. సర్వే నెంబరు 971లో 16.24 ఎకరాల శిఖం భూమిని గుర్తించేందుకు సర్వేలు ప్రారంభించినట్లు ఇరిగేషన్‌ డీఈ వేణుగోపాల్‌ పేర్కొన్నారు. 16.24 ఎకరాల శిఖం భూమిని గుర్తించి హద్దులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సర్వే ప్రక్రియ పూర్తి కావడానికి మూడు రోజులు పడుతుందన్నారు. సర్వే అనంతరం నివేదికను కలెక్టర్‌కు అంది స్తామన్నారు. సర్వేయర్‌ అశోక్‌కుమార్‌, ఇరిగేషన్‌ ఏఈ తిరుపతి, డిప్యూటీ తహసీల్దార్‌ సనత్‌కుమార్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఆల్లీపూర్‌ ఊర చెరువు విస్తీర్ణంపై సర్వే

దండేపల్లి, సెప్టెంబరు 23: దండేపల్లి మండలం ఆల్లీపూర్‌ గ్రామ సమీపంలో ఊర చెరువు గతంలో కబ్జాకు గురి కావడంపై గ్రామస్థులు గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆల్లీపూర్‌ ఊర చెరువు విస్తీర్ణంపై సోమవారం జిల్లా సర్వేయర్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ సంధ్యరాణి సిబ్బందితో సర్వే నిర్వహించారు. ఆల్లీపూర్‌లో 100 సర్వే నెంబర్‌లో సుమారు 59.33 ఎకరాల చెరువు విస్తీర్ణం ఉంటుందన్నారు. గతంలో గ్రామానికి చెందిన పలువురు రైతులు ఊర చెరువు భూమి అక్రమణకు గురవుతుందని రైతులు ఫిర్యాదు చేశారు. జిల్లా సర్వేయర్‌, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఊర చెరువుతోపాటు పక్కన ఉన్న పట్టాదారుల హద్దులు సర్వే చేశారు. పూర్తి సర్వేకు మూడు రోజులు అవుతుందని జిల్లా సర్వయర్‌ తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు సమగ్ర నివేదిక అందజేస్తామన్నారు. సర్వే సందర్భంగా ఎస్సై ఉదయ్‌కిరణ్‌ ఆధ్వర్యంలో ఏఎస్సైలు పున్నంచందు, రాజేందర్‌లు బందోబస్తు ఏర్పాటు చేశారు.

పలువురికి నోటీసులు అందజేత

భీమారం, సెప్టెంబరు 23 : భీమారం మండల కేంద్రంలోని బస్టాండ్‌ సమీపంలో గల ఊర చెరువు బఫర్‌ జోన్‌ ఎఫ్‌టీఎల్‌లో ఇండ్లు నిర్మించుకున్న యజమానులకు తహసీల్దార్‌ సదానందం ఆధ్వర్యంలో నోటీసులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ గత వారంలో ఊర చెరువు సర్వే పనులను రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారుల సమన్వయంతో పూర్తి చేసి హద్దులను ఏర్పాటు చేశామని తెలిపారు. చెరువు హద్దులో నిర్మాణాలు చేసుకున్న వారికి సోమవారం నోటీసులు అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ స్రవంతి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 10:38 PM