ఇందిరమ్మ ఇండ్ల సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Dec 13 , 2024 | 10:37 PM
జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ముల్కల్ల, గుడిపేట గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు.
హాజీపూర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం ముల్కల్ల, గుడిపేట గ్రామాల్లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం నీడ కల్పించాలనే ఉద్దేశ్యంతో ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుందన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారుల వివరాలను ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం గుడిపేటలో నిర్మాణంలో ఉన్న కేంద్రీయ విద్యాలయం పాఠశాల పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ శ్రీనివాస్‌దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
నస్పూర్, (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను అధికార యంత్రాంగం సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలోని 22, 24 వార్డుల్లో కలెక్టర్ సర్వే ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇండ్లను మంజూరు చేయడానికి సర్వే చేస్తున్నామన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ధరఖాస్తులు చేసుకున్న ధరఖాస్తుదారుల వివరాలను ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇండ్ల యాప్‌లో పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు.