విభిన్న ఆలోచనల ద్వారానే నూతన ఆవిష్కరణలు
ABN , Publish Date - Sep 28 , 2024 | 10:28 PM
విద్యార్థులు విభిన్న తార్కిక ఆలోచనల ద్వారానే శాస్త్రవేత్తలుగా తయా రవుతారని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరి షత్ పాఠశాలలో అటల్ టింకర్ ల్యాబ్ ప్రాజెక్టుల ప్రదర్శనలో భాగంగా ల్యాబ్‌లో విద్యార్థుల ప్రదర్శన లను పరిశీలించారు.
జైపూర్, సెప్టెంబరు 28: విద్యార్థులు విభిన్న తార్కిక ఆలోచనల ద్వారానే శాస్త్రవేత్తలుగా తయా రవుతారని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని జిల్లా పరి షత్ పాఠశాలలో అటల్ టింకర్ ల్యాబ్ ప్రాజెక్టుల ప్రదర్శనలో భాగంగా ల్యాబ్‌లో విద్యార్థుల ప్రదర్శన లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తార్కిక ఆలోచనల ద్వారా సైంటిస్టులుగా తయారవుతారని, దీనికి అటల్ టింకర్ ల్యాబ్ ఎంతో ఉపయోగపడు తుందన్నారు. జిల్లాలో అటల్ టింకర్ ల్యాబ్‌లు 8 ఉన్నాయన్నారు. అటల్ టింకర్ ల్యాబ్‌లో ఉత్తమ ప్రదర్శనకు పదో తరగతి విద్యార్థి అఖిల్‌కు సర్టిఫి కెట్ ప్రదానం చేశారు. 6వ తరగతిలో హాజరు శా తం ఎక్కువున్న విద్యార్థిని ఎలిసాల తేజస్విని డీఈ వో సన్మానించారు.
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకు రావాలని సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, జిల్లా కోఆర్డినేటర్ చౌదరి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ మద్దుల సునీత, మండల విద్యాధికారి శ్రీని వాస్, ప్రధానో పాధ్యాయురాలు ఆలిష్‌మాధుర్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.