ధ్రువపత్రాల జారీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Nov 07 , 2024 | 10:36 PM
వివిధ ధ్రువపత్రాలకు అందిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. సర్టిఫికెట్లను త్వరగా జారీ చేయాలని సూచించారు.
కన్నెపల్లి, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): వివిధ ధ్రువపత్రాలకు అందిన దరఖాస్తులను పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. సర్టిఫికెట్లను త్వరగా జారీ చేయాలని సూచించారు. ధరణి పోర్టల్‌లో అందిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
అనంతరం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. విద్యార్థినులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించి సూచనలు చేశారు. నాణ్యమైన భోజనం అందించాలని, అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని సూచించారు. మండల ప్రజాపరిషత్, పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఆదేశించారు. తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, ఏపీవో శ్రీనివాస్, ఏపీఎం అశోక్, ఉపాధ్యాయులు ఉన్నారు.