Share News

గిరిజన సంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలే

ABN , Publish Date - Oct 06 , 2024 | 10:17 PM

గిరిజన సంస్కృతీ, సంప్ర దాయాలను కాపాడేది ఆదివాసి గిరిజనులేనని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌ కోట్నాక తిరుపతి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌లు అన్నారు. గుడిరేవు గోదావరి నది ఒడ్డున పద్మల్‌పూరీ కాకో ఆలయంలో ఆదివారం దండారీ ఉత్సవాలు అట్టహా సంగా ప్రారంభమయ్యాయి.

గిరిజన సంప్రదాయాలను కాపాడేది ఆదివాసీలే

దండేపల్లి, అక్టోబరు 6: గిరిజన సంస్కృతీ, సంప్ర దాయాలను కాపాడేది ఆదివాసి గిరిజనులేనని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్‌ చైర్మన్‌ కోట్నాక తిరుపతి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్‌లు అన్నారు. గుడిరేవు గోదావరి నది ఒడ్డున పద్మల్‌పూరీ కాకో ఆలయంలో ఆదివారం దండారీ ఉత్సవాలు అట్టహా సంగా ప్రారంభమయ్యాయి. ఆలయం వద్ద ఎతై మాల్‌ పేన్‌ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆదివాసి గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.

గిరిజనుల ఆరాధ్య దైవం పద్మల్‌పూరీ కాకో అమ్మవారికి యేటా దసరా ముందు గోదావరి పుణ్యస్నానం ఆచరించి ఐదు రోజుల పాటు పూజలు చేస్తారన్నారు. కొత్త ధాన్యం తో కాకో అమ్మవారికి నైవేద్యం వండి సమర్పిం చారు. అనంతరం గిరిజనులతో సమావేశం నిర్వ హించి దండారీ ఉత్సవ వేడుకలపై చర్చించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ కుడిమేత సోముపటేల్‌, రాయిసెంటర్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఆల య నిర్వాహకులు లింగారావు, కాంతరావు, లచ్చుప టేల్‌, జంగు, గోపి, నరేందర్‌, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Oct 06 , 2024 | 10:17 PM