Share News

కార్మికశాఖ సర్వర్‌ డౌన్‌

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:01 PM

భవన నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించిన వివరాల నమోదు పోర్టల్‌ రెండు నెలల నుంచి నిలిచిపోయాయి. దీంతో వారికి అందాల్సిన పథకాలకు దూరం కావాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ సహాయ అధికారి పరిధిలో వివిధ రంగాలకు చెందిన 62,604 మంది కార్మికులు ఉన్నారు.

కార్మికశాఖ సర్వర్‌ డౌన్‌

మంచిర్యాల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ రంగ కార్మికులకు సంబంధించిన వివరాల నమోదు పోర్టల్‌ రెండు నెలల నుంచి నిలిచిపోయాయి. దీంతో వారికి అందాల్సిన పథకాలకు దూరం కావాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలోని కార్మికశాఖ సహాయ అధికారి పరిధిలో వివిధ రంగాలకు చెందిన 62,604 మంది కార్మికులు ఉన్నారు. కార్మికశాఖలో అసంఘటిత రంగ కార్మికులకంటే భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులే అధికంగా నమోదై ఉన్నారు. భవన నిర్మాణ రంగంలో పునాదులు తీసే కూలీలు మొదలుకొని తాపీమేస్త్రీలు, సెంట్రింగ్‌, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, పెయింటర్లు, టైల్స్‌, కార్పెంటర్‌, వెల్డింగ్‌, తదితర 36 రకాల పనులు చేసే కార్మికులు ఉన్నారు. వీరికి తెలం గాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా పలు రకాల సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమ లు చేస్తోంది. ఆ పథకాల కోసం దరఖాస్తు చేసుకునేం దుకు కార్మికశాఖ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. ఆ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే రెండు నెలలుగా పోర్టల్‌ పనిచేయక పోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు.

కార్మికులకు అందించే పథకాలు....

రాష్ట్ర కార్మిక శాఖ నుంచి భవన ఇతర నిర్మాణ కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ బోర్డు ద్వారా ఆర్థిక సహాయం ఆందించే పథకాలు అమలవుతున్నాయి. కార్మిక శాఖలో నమోదై ఉన్న కార్మికుడు ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.6 లక్షలు, సహజ మరణానికి రూ.లక్ష పరిహారం అందజేస్తారు. ఆస్పత్రి ఖర్చులకు గరిష్టంగా నెలకు రూ. 4,500 చొప్పున అందిస్తారు. అంత్యక్రియలకు రూ.30 వేలు, శాశ్వత అంగవైకల్యానికి రూ.4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పరిహారం చెల్లిస్తారు. అలాగే మహి ళా కార్మికులు ప్రసూతి అయితే రూ. 30వేల సహాయాన్ని అందజేస్తారు. కృత్రిమ అవయవాల కొనుగోలుకూ నిధులు మంజూరవుతాయి. ఇవే కాకుండా కార్మికులకు రోజుకు రూ.300 చొప్పున ఉపకార వేతనం ఇస్తూ నైపుణ్య అభివృద్ధి శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. భవన నిర్మాణ కార్మికునిగా నమోదు కాని వ్యక్తి పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ.50వేలు, అంగ వైకల్యానికి రూ.20 వేలు పరిహారం చెల్లిస్తారు. ఇవేకాకుండా తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ద్వారా దుకాణాలు, సంస్థలు, పరిశ్రమలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంఘాలు, ట్రస్ట్‌లలో పనిచేస్తూ కార్మిక సంక్షేమ నిధికి జమచేసే కార్మికులకు పథకాలను అమలు చేస్తున్నారు.

మూతపడ్డ పోర్టల్‌....

భవన నిర్మాణ కార్మికుల పథకాలన్నీ ్టఛౌఛిఠీఠీఛ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ పోర్టల్‌ ఆధారంగా అమలు చేస్తున్నారు. ఇందులో నూతన కార్మికుల నమోదు, రెన్యూవల్‌, వివిధ రకాల పథకాల కింద పరిహారం, ప్రోత్సాహకాలను అందజేస్తు న్నారు. రెండు నెలలుగా ఈ పోర్టల్‌ ఓపెన్‌ చేస్తే సర్వర్‌ ఈజ్‌ డౌన్‌ ప్లీజ్‌ చెక్‌ బ్యాక్‌ లేటర్‌ అంటూ సందేహాన్ని చూపుతోంది. కార్మికుల నివేదికలు, ఇతర సమాచారం సైతం అందుబాటులో లేదు. దీంతో ఈ మధ్యకాలంలో మృతి చెందిన, ప్రమాదాలకు గురైన వారు, ప్రసూతి అయిన మహిళా కార్మికులు, వారి పిల్లలకు పథకం అమలు కోసం దరఖాస్తు చేసుకునేందుకు కార్మికశాఖ కార్యాలయానికి వెళితే పోర్టల్‌ బంద్‌ అని సమాధానం వస్తోంది. ఇదిలా ఉండగా భవన నిర్మాణ కార్మికుల గుర్తింపు కార్డు కాలపరిమితి ముగిసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే కార్డు రెన్యూవల్‌ కాకపోవడంతో పరిహారం పొందే అవకాశాన్ని కూడా కోల్పోవలసి వస్తోంది. వేలాది మంది కార్మికులు వివిధ రకాల పథకాల కోసం దరఖాస్తు చేసుకొని పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. రెండు నెలలైనా పోర్టల్‌ను పునరుద్దరించకపోవడంపై కార్మిక సంఘాల నాయకులు పెదవి విప్పకపోవడం గమనార్హం. కార్మికశాఖ నిధులను ఇతర అవసరాలకు వాడుకొని పోర్టల్‌ను కావాలనే నిలిపి వేశారనే అపవాదులు సైతం ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికశాఖ పోర్టల్‌ను వెంటనే పునఃప్రారంభించడం ద్వారా తమకు పథకాలు తిరిగి అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

సాఫ్ట్‌వేర్‌ క్లియర్‌ అయితే సేవల పునరుద్దరణ

ఎం సురేందర్‌, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌

పోర్టల్‌ బంద్‌ అయిన కారణంగా సెప్టెంబరు 7 నుంచి ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. ప్రస్తుతం వర్కర్‌ రిజిస్ట్రేషన్‌ రెన్యూవల్స్‌ జరుగుతున్నాయి. క్లైమ్స్‌ మాత్రం అమలు కావడం లేదు. ఇన్ని రోజులు ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్‌ఫర్మాటిక్స్‌ సెంటర్‌) సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్యల వల్ల సేవలకు అంతరాయం కలిగింది. ఎన్‌ఐసీలో సాఫ్ట్‌వేర్‌ క్లియర్‌ అయ్యాక అన్ని సేవలు తిరిగి అందుబాటులోకి వస్తాయి.

Updated Date - Nov 06 , 2024 | 11:01 PM