Share News

నాలుగు లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాడుదాం

ABN , Publish Date - Sep 23 , 2024 | 10:33 PM

మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా పొరాడుదా మని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జైపాల్‌సింగ్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌లు పిలుపునిచ్చారు. సోమవారం బస్టాండ్‌ ఆవరణలో నాలుగు లేబర్‌ కోడ్‌ల ప్రతులను దహ నం చేశారు.

నాలుగు లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా పోరాడుదాం

మంచిర్యాల అర్బన్‌, సెప్టెంబర్‌ 23 : మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో ప్రవేశపెట్టిన నాలుగు లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా పొరాడుదా మని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జైపాల్‌సింగ్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌లు పిలుపునిచ్చారు. సోమవారం బస్టాండ్‌ ఆవరణలో నాలుగు లేబర్‌ కోడ్‌ల ప్రతులను దహ నం చేశారు. వారు మాట్లాడుతూ గతేడాది మోదీ ప్రభుత్వం ఎలాంటి చర్చలు లేకుండా కార్మిక చట్టాలను సవరించిందన్నారు. పెట్టుబడిదారు లైన అధానీ, అంబానీ లాంటి కార్పొరేట్‌ వ్యక్తులకు మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను తాకట్టుపెట్టే విధంగా వ్యవహరిస్తుందన్నారు. మోదీ చర్యలను నిరసిస్తూ బ్లాక్‌ డేను విజయవంతంగా కొనసాగిస్తున్నామ న్నారు. ఇప్పటికైనా కార్మిక చట్టాలను సవరించి లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు బింగి సుధాకర్‌, జాడి చం ద్రయ్య, ఐఎఫ్‌టీయూ నాయకులు అరుణ, గొల్ల అంజయ్య, సతీష్‌, బుట్ట గడ్డ చిన్నన్న, సురేష్‌, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి: కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్‌ కోడ్‌లు తెచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం పట్టణంలోని కాంటా చౌరస్తాలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు లేబర్‌ కోడ్‌ పత్రాలను దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ కేంద్రం కార్పొ రేట్‌లకు అనుకూలంగా, కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా కుదించి కార్మికులకు అన్యాయం చేసింద న్నారు. ఇప్పటికైనా కేంద్రం నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, సిం గరేణి ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నాయకులు మణిరాంసింగ్‌, చాంద్‌పాషా, గౌస్‌, రాజన్న, మహేందర్‌, శంకర్‌, రాంసింగ్‌, పోచమల్లు, తదితరులు పాల్గొన్నారు.

కాసిపేట: కేంద్రం 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ బ్లాక్‌డేగా నిర్వహించామని హెచ్‌ఎంఎస్‌ మందమర్రి ఏరి యా వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. గనిపై నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కేంద్రం కార్పొరేట్‌లకు మేలు చేసేందుకు నాలుగు కోడ్‌లను తీసుకువచ్చి కార్మికులకు అన్యాయం చేసిందన్నారు. పార్వతి రాజిరెడ్డి, వెల్ది సుదర్శన్‌, ఎర్ర శ్రీనివాస్‌రెడ్డి, చొప్పరి రామస్వామి, థామస్‌, ప్రభాకర్‌, ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 10:33 PM