చెరువు మత్తడి ధ్వంసం కేసులో ప్రధాన నిందితుల అరెస్టు
ABN , Publish Date - Oct 04 , 2024 | 10:41 PM
చెన్నూరు పట్టణంలోని శన గకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో ప్రధాన నిందితులైన చెన్నూరు మున్సిపల్ చైర్‌పర్సన్ అర్చన గిల్డా భర్త రాంలాల్‌గిల్డా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్యతోపాటు ఎన్నం బానయ్య లను అరెస్టు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో విలే కరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
జైపూర్, అక్టోబరు 4: చెన్నూరు పట్టణంలోని శన గకుంట చెరువు మత్తడి ధ్వంసం కేసులో ప్రధాన నిందితులైన చెన్నూరు మున్సిపల్ చైర్‌పర్సన్ అర్చన గిల్డా భర్త రాంలాల్‌గిల్డా, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్యతోపాటు ఎన్నం బానయ్య లను అరెస్టు చేసినట్లు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఏసీపీ కార్యాలయంలో విలే కరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. చెరువు మత్తడిని గత నెల 16న జిలెటిన్ స్టిక్స్ అమ ర్చి ధ్వంసం చేశారన్నారు. ఈ కేసులో కౌన్సిలర్ పెం డ్యాల స్వర్ణలత భర్త లక్ష్మీనారాయణ, బీమ్ మధు కర్, రాసమల్ల శ్రీనివాస్, దానం నాగయ్యలను అరెస్ట్ చేశామన్నారు. వారిని విచారించగా చెరువు ఎఫ్‌టీ ఎల్, బఫర్ జోన్‌లోని భూమిని కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రామ్‌లాల్‌గిల్డా, బత్తుల సమ్మయ్య, మంచాల రాజబాపు, నడిపెల్లి లక్ష్మణ్ రావు, ఉమేష్‌గిల్డా, లక్కం రాజబాపు, పెద్దింటి శ్రీని వాస్, పోగుల శేఖర్, ఇప్ప సంపత్, ఎన్నం బాన య్యలు పట్టణానికి చెందిన గొడిసెల బాపురెడ్డికి విక్రయించారన్నారు. వర్షాకాలంలో నీరు నిల్వ ఉం డడంతో ఇరుపార్టీల మధ్య వివాదం ఏర్పడింద న్నారు. చెరువు మత్తడిని ధ్వంసం చేసేందుకు పథ కం రచించారన్నారు. రూ.4 లక్షల డీల్ కుదర్చుకోగా లక్ష్మీనారాయణ, మధుకర్, శ్రీనివాస్‌లకు రూ.2 లక్ష లు ఇచ్చారన్నారు. వీరు ఏసీసీ ప్రాంతానికి చెందిన దానం నాగయ్యతో కలిసి మత్తడిని పేల్చివేశార న్నారు. ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు మేరకు కేసు విచా రణ జరపగా గత నెల 20న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నట్లు తెలి పారు. కాల్‌డేటా, బ్యాంకు ఖాతా లావాదేవీలపై వి చారణ చేపట్టి గురువారం ఏడుగురిని అరెస్టు చేశా మన్నారు. ప్రధాన నిందితులైన ముగ్గురిని చెన్నూరు బస్టాండ్ ప్రాంతంలో అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఏసీపీ తెలి పారు. మొత్తం 14 మందిపై కేసులు నమోదు చేసి నట్లు ఆయన వివరించారు. సమావేశంలో చెన్నూరు సీఐ రవీందర్ పాల్గొన్నారు.