మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం
ABN , Publish Date - Nov 11 , 2024 | 10:34 PM
దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధికి కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం ఆజాద్ జయంతిని కలెక్టరేట్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఆజాద్ చిత్రపటనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యాభివృద్ధికి కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం ఆజాద్ జయంతిని కలెక్టరేట్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఆజాద్ చిత్రపటనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ దేశ విద్యావ్యవస్థకు ఆజాద్ అందించిన సేవలను గౌరవించుకుంటూ జయంతి రోజున జాతీయ విద్యా దినోత్సవం, జాతీయ మైనార్టీ దినోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా మైనార్టీ శాఖ అధికారి రాజేశ్వరి అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించేందుకు చర్యలు
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకొంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాసరావు, హరికృష్ణతో కలిసి ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కోటపల్లి, నెన్నెల, జన్నారం, కాసిపేట, బెల్లంపల్లి, లక్షెట్టిపేట ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకొంటామన్నారు.