Share News

అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే

ABN , Publish Date - Nov 06 , 2024 | 10:55 PM

ఎన్నికల సమయంలో గడ్డం వినోద్‌ అబద్దపు హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలను మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధ వారం 2వ వార్డులో 200 మందికి పైగా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు.

అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే

బెల్లంపల్లి, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో గడ్డం వినోద్‌ అబద్దపు హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలను మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధ వారం 2వ వార్డులో 200 మందికి పైగా బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎన్నికల సమయం లో మెడికల్‌ కళాశాల, పాలిటెక్నిక్‌ కళాశాలను ఇంజనీరింగ్‌ కళాశా లగా అప్‌గ్రేడ్‌, బస్‌ డిపో ఏర్పాటు చేస్తానని ప్రజలకు అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడన్నారు.

స్ధానికంగా ఉంటానని ర చెప్పి అప్పుడప్పుడు వస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేద న్నారు. రాష్ట్రంలో 9 పాలిటెక్నిక్‌ కళాశాలలు అప్‌గ్రేడ్‌ అయినా ఎమ్మెల్యే వినోద్‌ చేతకానితనంతో బెల్లంపల్లిలో అప్‌గ్రేడ్‌ కాలేదన్నారు. కూరగాయల మార్కెట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు, లేదా గుండా మల్లేష్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌, పట్టణాధ్యక్షుడు సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్య క్షుడు శ్రావణ్‌, మైనార్టీ పట్టణాధ్యక్షుడు ఎండీ ఆలీ పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2024 | 10:55 PM