బీసీ కుల గణన కోసం దేశ వ్యాప్త ఉద్యమం
ABN , Publish Date - Nov 29 , 2024 | 10:50 PM
బీసీ కుల గణన కోసం దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నిర్వహించిన బీసీ కుల గణన చైతన్య యాత్ర ముగింపు సభను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్‌హాలులో నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : బీసీ కుల గణన కోసం దేశ వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు నిర్వహించిన బీసీ కుల గణన చైతన్య యాత్ర ముగింపు సభను శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఫంక్షన్‌హాలులో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సమగ్ర కుల గణన నిర్వహించి బీసీల లెక్కలు తేల్చాలని మూడు దశాబ్దాలుగా చేసిన పోరాటం నేడు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ఫలప్రదమైం దన్నారు. బీసీ కులగణన చారిత్రాత్మకమైన అంశమన్నారు. బీసీల లెక్కలు తేలాక జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్ తేలుతుందన్నారు. బీసీ కుల గణనను అడ్డుకోవాలని చూసిన కొన్ని శక్తులు ప్రయత్నాలు ఫలించలేదన్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీసీ కులగణన చేపట్టాలని పిలుపునివ్వడంతోనే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిం చిందని, బీసీలంతా ఏకతాటిపై ఉన్నట్లుగా భావించవచ్చని ఈ విజయా లతో తేలిపోయిందన్నారు. రానున్న ఎన్నికల్లో రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగి బీసీల ఐక్యతను ప్రదర్శిస్తామన్నారు. రాష్ట్రంలో కులాల తోనే రాజకీయాలు నడుస్తున్నాయని, ఒకరి తర్వాత ఒకరు పాలన సాగి స్తూ బీసీ, ఎస్సీలకు అవకాశం లేకుండా చేస్తున్నారన్నారు.
ఇప్పటికైనా బీసీ లందరు మేల్కొని జాగృతం కావాలన్నారు. రాష్ట్రంలో 1కోటి 17లక్షల36వేల కుటుంబాలకు కుల గణన స్టిక్కర్ వేశారని, 56 సంచార కులాలకు స్టిక్క రింగ్, సర్వే ఫారాలు నింపలేదని, వారికిఇండ్లు లేవని అధికారులు కారణం చెప్పడం సరికాదన్నారు. వారు ఉంటున్న చోట సర్వే నిర్వహించాలని పేర్కొన్నారు. 2028 ఎన్నికల్లో 60 మంది బీసీ ఎమ్మెల్యేకు, 9 మంది ఎంపీ స్ధానాల్లో బీసీలు బరిలో ఉండి రాజ్యాధికారం చేజిక్కించుకోవాలని పిలుపు నిచ్చారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కులకచర్ల శ్రీనివాస్, జాతీయ విద్యార్థి సంఘం అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్, గణేష్‌చారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నీలకంటేశ్వర్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్‌గౌడ్, రాంశెట్టిన నరేందర్, వెంకటేష్, శంకర్, రాజన్న, రాజన్న యాదవ్, నరెడ్ల శ్రీనివాస్, రమేష్, రంజిత్‌గౌడ్, రవియాదవ్, పాల్గొన్నారు.