Share News

వైద్య సేవలు అందించడంలో అలసత్వం వద్దు

ABN , Publish Date - Sep 09 , 2024 | 10:33 PM

ప్రభుత్వ జనరల్‌ ఆసు పత్రిపై నమ్మకంతో చికిత్స కోసం వచ్చే పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. సోమవారం ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే అన్ని వార్డులు పరిశీలించారు.

వైద్య సేవలు అందించడంలో అలసత్వం వద్దు

మంచిర్యాల, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జనరల్‌ ఆసు పత్రిపై నమ్మకంతో చికిత్స కోసం వచ్చే పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. సోమవారం ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే అన్ని వార్డులు పరిశీలించారు. ఆయన రోగులతో మాట్లాడారు.

ఆరోగ్య పరిస్థితి, వైద్య సేవలు, మందులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే ఏడాదిన్నర సమయంలో ఐబీ ప్రాంగణంలో కార్పొరేట్‌ స్థాయి వైద్యశాల ఏర్పాటు అవుతుందని తెలిపారు. హైదారాబాద్‌ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. మంచిర్యాల జిల్లాతోపాటు ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మహా రాష్ట్ర వాసులకు ఉత్తమ వైద్య సేవలు అందుతాయన్నారు. పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 10:33 PM