Share News

ఆగని అక్రమ నిర్మాణాలు

ABN , Publish Date - Oct 08 , 2024 | 10:18 PM

జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ, అదుపులేకుండా పోతోంది. ఓ వైపు మున్సిపల్‌ అధి కారులు అక్రమ కట్టడాలపై కొరఢా ఝళిపిస్తుండగా, మరోవైపు నిబంధన లకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమ నార్హం.

ఆగని అక్రమ  నిర్మాణాలు

మంచిర్యాల, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ, అదుపులేకుండా పోతోంది. ఓ వైపు మున్సిపల్‌ అధి కారులు అక్రమ కట్టడాలపై కొరఢా ఝళిపిస్తుండగా, మరోవైపు నిబంధన లకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమ నార్హం. అక్రమ కట్టడాలు అని తెలిసి కూడా బహుళ అంతస్తుల భవనాల యజమానులు నిర్మాణ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహిరించడం కొసమెరుపు.

రోడ్డు ఆక్రమణలపై కొరఢా

జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో రోడ్ల ఆక్రమణలపై ఇటీవల మున్సిపల్‌ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. ప్రధానంగా బాలుర ఉన్నత పాఠశాల, మార్కెట్‌ రోడ్డు, అర్చన టెక్స్‌ చౌరస్తాలో రోడ్లను ఆక్రమించి వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. అధికారులు తొలగిస్తున్న వాటిలో చిరు వ్యాపారులు మొదలుకొని బడా బాబులకు చెందిన భవనాలు ఉన్నాయి. అర్చన టెక్స్‌ చౌరస్తా నుంచి మొదలుకొని పోలీస్‌స్టేషన్‌ చౌరస్తా వరకు అక్రమ కట్టడాలను తొలగించాలని ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయా నిర్మాణాలను యజమానులు స్వచ్ఛందంగా తొలగిస్తుండగా, మరికొన్ని చోట్ల అధికారులే కూల్చి వేయిస్తున్నారు. అయితే పండుగ సమయంలో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో తొలగింపు ప్రక్రియకు కొంత విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలోనూ మున్సిపల్‌ అధికారులు ఆక్రమణలను తొలగించేందుకు యత్నించగా, అప్పట్లో మంచిర్యాల ఏసీపీగా విధులు నిర్వహించిన విజయ్‌కుమార్‌ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దీంతో మార్కెట్‌ రోడ్డులోని కొన్ని బహుళ అంతస్థుల భవనాల మెట్లను తొలగించారు. అయితే ఆ తరువాత రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. ఫలితంగా రోడ్డు ఆక్రమణలు మరింతగా విస్తరించాయి. ప్రస్తుతం అక్రమ నిర్మాణాలపై మున్సిపల్‌ అధికారులు దృష్టి సారించడంతో ఇప్పటికైనా రహదారి ఆక్రమణల తొలగింపు ముందుకు సాగుతుందా...! అనే సందేహాలు సర్వత్రా వ్యక్తమతున్నాయి.

నాలాలపై వెలుస్తున్న నిర్మాణాలు....

గతంలో ఖాళీగా ఉన్న రోడ్డు ఆక్రమణలతోనే పరిమితమైన అక్రమ నిర్మాణాలు తాజాగా నాలాలపై వెలుస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల పక్కన పెద్ద పెద్ద నాలాలను నిర్మించారు. వర్షాకాలంలో వరద పోటు సమస్య తలెత్తకుండా ఈ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏసీసీ చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు, మార్కెట్‌ రోడ్డులో, బైపాస్‌ రోడ్డులో, ప్రభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలో, హమాలివాడ, గౌతమీ నగర్‌, పాత మంచిర్యాలలో ప్రధాన రహదారుల వెంట విశాలమైన నాలాలు దర్శనమిస్తున్నాయి. అయితే వాటిపై అక్రమ నిర్మాణాలు చేపడు తూ కొందరు కబ్జాలకు పాల్పడుతున్నారు. దీంతో నాలాలు ఇరుకుగా మారి, వరదల సమయంలో వర్షం నీరంతా రోడ్లపైకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2022 జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా నాలాల నుంచి నీరు రోడ్లపై ప్రవహించింది. దీంతో సమీపంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.

రెండేళ్ల క్రితం మంచిర్యాల-బెల్లంపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న విశాలమైన నాలాలో బజాజ్‌ షోరూం సమీపంలో కొందరు బడా వ్యాపారులు పెద్ద గుంతలు తీసి, ఏకంగా పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. నాలాపై స్లాబు నిర్మించడం ద్వారా రహదారి నుంచి భవనం వరకు అక్రమంగా రోడ్డు నిర్మించేందుకు యత్నించారు. అప్పట్లో ఆంధ్రజ్యోతిలో కథనం ప్రచురితం కావడంతో మున్సిపల్‌ అధికారులు పిల్లర్లను తొలగించారు. వాస్తవానికి నాలాలపై శాశ్వత కట్టడాలు నిర్మించరాదు. నాలాను దాటేందుకు తాత్కాలికంగా ఇతరత్రా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇదిలా ఉండగా, ఇటీవల బైపాస్‌ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవన యజమాని నిబంధనలకు విర్ధుదంగా నాలాపై స్లాబు నిర్మించాడు. బైపాస్‌ రోడ్డు మొదలుకొని భవనం వరకు సుమారు ఆరు ఫీట్ల పొడవు, 12 ఫీట్ల వెడల్పుతో శాశ్వతంగా స్లాబు నిర్మించాడు. ఈ తతంగమంతా బహిరంగానే జరుగుతున్నా అధికారుల దృష్టికి రాకపోవడం శోచనీయం.

Updated Date - Oct 08 , 2024 | 10:18 PM