Share News

పాత పింఛన్‌ను పునరుద్ధరించాలి

ABN , Publish Date - Aug 31 , 2024 | 10:59 PM

ప్రభుత్వం వెంటనే కాంట్రీ బ్యూటరీ పింఛన్‌ స్కీంను రద్దు చేసి పాత పింఛ న్‌ను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపా ధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీని వాసరావు పేర్కొన్నారు. శనివారం పింఛన్‌ విద్రోహ దినం సందర్భంగా దేవులవాడ ఉన్నత పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

పాత పింఛన్‌ను పునరుద్ధరించాలి

కోటపల్లి, ఆగస్టు 31: ప్రభుత్వం వెంటనే కాంట్రీ బ్యూటరీ పింఛన్‌ స్కీంను రద్దు చేసి పాత పింఛ న్‌ను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపా ధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీని వాసరావు పేర్కొన్నారు. శనివారం పింఛన్‌ విద్రోహ దినం సందర్భంగా దేవులవాడ ఉన్నత పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలకు పైగా ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఎలాంటి భరోసా ఇవ్వని సీపీఎస్‌ను రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ప్రభుత్వ భాగ స్వామ్య డబ్బును షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టి దాని ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని పింఛన్‌గా ఇవ్వడం అంటే గాలిలో దీపం వెలిగించడం లాంటిదన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

బెల్లంపల్లి: సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం వెంటనే సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పున రుద్ధరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Aug 31 , 2024 | 10:59 PM