Share News

పాముకాటుతో ఒకరి మృతి

ABN , Publish Date - Sep 14 , 2024 | 10:59 PM

దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీలో పాముకాటుతో సెక్యూరిటీ గార్డు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని ఆరుగురు సెక్యూరిటీ గార్డులు బ్యారక్‌కు చేరుకొని నిద్రలోకి జారు కున్నారు.

పాముకాటుతో ఒకరి మృతి

కాసిపేట, సెప్టెంబరు 14: దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీలో పాముకాటుతో సెక్యూరిటీ గార్డు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని ఆరుగురు సెక్యూరిటీ గార్డులు బ్యారక్‌కు చేరుకొని నిద్రలోకి జారు కున్నారు. అర్థరాత్రి ఏదో పాకుతున్నట్టు గమనించి ఉలిక్కిపడి లేచి చూడగా పాము కనబడింది. అందరూ నిద్ర లేచి పామును చంపేసి మళ్ళీ నిద్రపోయారు. అనంతరం శనివారం తెల్లవారుజామున చేదం నవీన్‌ (24) కడుపులో తిప్పుతుందని బాత్‌రూంకు వెళ్ళి అక్క డే కుప్పకూలి మృతి చెందాడు. మరో సెక్యూరిటీ గార్డు వైభవ్‌ దూబే నోటి నుంచి నురుగులు రావడాన్ని గమ నించిన తోటి ఉద్యోగులు వెంటనే ఓరియంట్‌ డిస్పె న్సరీకి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. పాము ముందుగా చేదం నవీన్‌న కాటేసి అనంతరం వైభవ్‌ను కాటేసి ఉంటుందని పేర్కొన్నారు. మృతుడు చేదం నవీన్‌ కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలానికి చెందినవాడు కాగా, వైభవ్‌ దూబే మహారాష్ట్రకు చెందిన వాడని తెలిపారు.

ఈ సందర్భంగా నాయకపోడు సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్ది భార్గవ్‌, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ సెక్యూరిటీ గార్డులు నివాసం ఉండే బ్యారక్‌ వద్ద ఎలాంటి రక్షణ చర్యలు లేక పోవ డంతో విష పురుగులు సంచరిస్తున్నాయన్నారు. సిబ్బంది భద్రతపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓరి యంట్‌ కంపెనీ యాజమాన్యం నైతిక బాధ్యత వహించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాల న్నారు. కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘాల నాయకులు పల్లె చంద్రయ్య, కనకరాజు, హన్మంతు పాల్గొన్నారు.

న్యాయం చేయాలని ఆందోళన

బెల్లంపల్లి: దేవాపూర్‌లో పాము కాటుకు గురై మృతి చెందిన నవీన్‌ కుటుంబానికి న్యాయం చేయా లని శనివారం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబ సభ్యులు, ఆదివాసీ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఉదయం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చినప్పటికి సాయంత్రం వరకు పోస్టుమార్టం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించా రని పేర్కొన్నారు. పాము కాటుకు గురైన నవీన్‌ కుటుంబ సభ్యులకు రూ.20 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆందోళనకు దిగారు. దీంతో అక్కడకు పోలీసులు, ఓరియంట్‌లో విధులు నిర్వ హించే అధికారులు చేరుకొని బాధిత కుటుంబ సభ్యు లతో మాట్లాడారు. రూ.8 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆందో ళన విరమించారు.

సింగరేణి కార్మికుడికి పాముకాటు

జైపూర్‌: శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఐకే 1ఏ గనికి చెందిన రాము అనే జనరల్‌ మజ్దూర్‌ కార్మికుడు పాముకాటుకు గురయ్యాడు. తోటి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం ఇందారం గోదావరి నది వద్ద ఏర్పాటు చేసిన షెల్టర్‌లో రివర్‌ గార్డుగా మొదటి షిఫ్ట్‌ విధులు నిర్వహిస్తుండగా పాముకాటుకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే సింగ రేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరు గైన వైద్యం నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లు కార్మికులు పేర్కొన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 10:59 PM