ఓపెన్ స్కూల్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Dec 29 , 2024 | 10:18 PM
ఓపెన్‌స్కూల్ తరగతులను సద్విని యోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎన్.అశోక్ అన్నారు. దండేపల్లి ఉన్నత పాఠశాలలో తరగతులను ఆదివారం పరిశీలిం చారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు రెగ్యులర్ పది, ఇంటర్‌తో సమానమన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చనన్నారు.
దండేపల్లి, డిసెంబరు29(ఆంధ్రజ్యోతి): ఓపెన్‌స్కూల్ తరగతులను సద్విని యోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ ఎన్.అశోక్ అన్నారు. దండేపల్లి ఉన్నత పాఠశాలలో తరగతులను ఆదివారం పరిశీలిం చారు. ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు రెగ్యులర్ పది, ఇంటర్‌తో సమానమన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందవచ్చనన్నారు.
ఈనెల 30లోగా ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు తాత్కాల్ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్‌లో జరిగే వార్షిక పరీక్షలకు అభ్యాసకులు ఇప్పటి నుంచే సిద్ధం కావాలన్నారు. సహాయ కోఆర్డినేటర్ సంగర్స్ రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు కొండు జనార్దన్, రామన్న, చెట్టుపల్లి రమేష్, అభ్యాసకులు పాల్గొన్నారు.