Share News

పార్ట్‌టైం ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి

ABN , Publish Date - Sep 05 , 2024 | 10:41 PM

జిల్లాలో సోషల్‌ వేల్పేర్‌ రెసిడెన్సీ స్కూల్స్‌లో పని చేస్తున్న పార్ట్‌టైం, గెస్ట్‌ ఫ్యాకల్టీ హిందీ-2, ఏసీటీ, పీఈటీ పీడీలు, వాచ్‌ మెన్‌లను తొలగించడాన్ని నిరసిస్తూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు అందించారు. వారు మాట్లాడుతూ మూడు మాసాల నుంచి వేత నాలు రావడం లేదని, ఆకస్మికంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్ట్‌టైం ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలి

నస్పూర్‌, సెప్టెంబరు 5: జిల్లాలో సోషల్‌ వేల్పేర్‌ రెసిడెన్సీ స్కూల్స్‌లో పని చేస్తున్న పార్ట్‌టైం, గెస్ట్‌ ఫ్యాకల్టీ హిందీ-2, ఏసీటీ, పీఈటీ పీడీలు, వాచ్‌ మెన్‌లను తొలగించడాన్ని నిరసిస్తూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు అందించారు. వారు మాట్లాడుతూ మూడు మాసాల నుంచి వేత నాలు రావడం లేదని, ఆకస్మికంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో తొలగిస్తే తాము ఎక్కడికి వెళ్ళాలన్నారు. తమ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారాయన్నారు. తమ సమస్య పరిష్కరించి న్యాయం చేయాలని విన్నవించారు. రవి, తిరుపతి, స్రవంతి, మహేష్‌, జాడి మహేష్‌, కుమార్‌, బాపు, గణేష్‌, శ్రీనివాస్‌, సతీష్‌ పార్ట్‌టై టీచర్స్‌, సిబ్బంది, పేరెంట్‌ కమిటీ పాల్గొన్నారు.

గురుకులాల మూసివేతకు ప్రభుత్వం కుట్ర

బెల్లంపల్లి, సెప్టెంబరు 5: గురుకులాల మూసివేతకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏఐఎఫ్‌డీఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. గురువారం బెల్లంపల్లిలో నిర్వహించిన సమావేశంలో మాట్లా డుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అకాడమిక్‌ మధ్యలో సాంఘిక సంక్షేమ కళాశా లల్లో పనిచేసే సబ్జెక్టు అసోసియేట్స్‌, పార్ట్‌టైమ్‌ అధ్యాపకులను తొలగిస్తూ ఈ నెల 3న ఉత్తర్వులు జారీ చేయడం అన్యాయమన్నారు. 250 మంది సబ్జెక్టు టీచర్లు, 4,500 మంది పార్ట్‌టైం అధ్యాపకులను తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. తొలగించిన వారందర్ని విధు ల్లోకి తీసుకోవాలన్నారు. రాకేష్‌, నరేష్‌, మహేష్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 10:41 PM