చప్రాలకు ప్రారంభమైన భక్తుల పాదయాత్ర
ABN , Publish Date - Dec 29 , 2024 | 10:20 PM
మంచిర్యాలోని ఐబీ చౌరస్తాలో గల భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి ఆదివారం దత్తావతార కార్తీక్ మహారాజ్ చప్రాడ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర రెబ్బెన, టోంకిని మీదుగా ఈ నెల31న సాయంత్రం మహారాష్ట్రలోని హనుమాన్ మందిర్ ప్రశాంత్‌ధాం వరకు సాగనుందని భక్తులు తెలిపారు.
గర్మిళ్ల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మంచిర్యాలోని ఐబీ చౌరస్తాలో గల భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి ఆదివారం దత్తావతార కార్తీక్ మహారాజ్ చప్రాడ పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర రెబ్బెన, టోంకిని మీదుగా ఈ నెల31న సాయంత్రం మహారాష్ట్రలోని హనుమాన్ మందిర్ ప్రశాంత్‌ధాం వరకు సాగనుందని భక్తులు తెలిపారు. పాదయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బెల్లంపల్లి, (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలోని చప్రాల హనుమాన్ మందిర్ ప్రశాంత్‌ధాంకు భక్తులు పాదయాత్రగా వెళ్లారు. భక్తుల పాదయాత్ర మంచిర్యాల నుంచి బెల్లంపల్లికి చేరుకుంది. నల్గొండ జిల్లా సూర్యపేటకు చెందిన భక్తులు 2016 నుంచి మంచిర్యాల నుంచి చప్రాల వరకు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. 35 మందికి పైగా భక్తులు కాలినడకన బయల్దేరారు. నూతన సంవత్సరం రోజు చప్రాలలో యేటా పూజలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. పాదయాత్ర వల్ల ప్రశాంతతో పాటు, ఆరోగ్యం చేకూరుతున్నాయని వారు తెలిపారు.