Share News

ఘనంగా పొలాల అమావాస్య

ABN , Publish Date - Sep 02 , 2024 | 10:46 PM

అన్నదాతకు సాగులో తోడుండే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను సోమవారం మండ లంలో ఘనంగా జరుపుకున్నారు. పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నాలతో బసవ న్నలకు ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. ఎడ్లతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించారు.

ఘనంగా పొలాల అమావాస్య

నెన్నెల, సెప్టెంబరు 2: అన్నదాతకు సాగులో తోడుండే మూగజీవాలను కొలిచే పొలాల అమావాస్యను సోమవారం మండ లంలో ఘనంగా జరుపుకున్నారు. పూల దండలు, గజ్జెలు, కొత్త కన్నాలతో బసవ న్నలకు ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలను సమర్పించారు. ఎడ్లతో దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొక్కులు చెల్లించారు. అనంతరం బసవన్న లను ఆలయాలకు తీసుకెళ్తారు. పల్లెలు పాడిపంటలతో సుభిక్షంగా ఉండేలా చూడా లని దైవాన్ని వేడుకున్నామని రైతులు పేర్కొ న్నారు. వ్యవసాయేతర కుటుంబాల వారు మట్టితో చేసిన ఎడ్ల ప్రతిమలను ఇళ్లల్లో ప్రతిష్ఠించి పూజలు చేశారు. పండగను ఐదు రోజులపాటు ఘనంగా జరుపుకుంటామని నేతకాని కులస్తులు తెలిపారు.

కోటపల్లి: పొలాల అమావాస్య పర్వదినా న్ని మండల ప్రజలు ఘనంగా జరుపుకు న్నారు. గ్రామ దేవతలైన పోచమ్మ,పోలేరమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. మరో వైపు మట్టితో తయారు చేసిన ఎడ్లకు ఇండ్లలో పూజలు నిర్వహించారు. సాయం త్రం వేళ ఎద్దులను అలంకరించి దేవాల యాల్లో ప్రదక్షిణ నిర్వహించారు. రైతులు సంతోషంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

మందమర్రిరూరల్‌:ఆదిల్‌పేట మామి డిగట్టు, వెంకటాపూర్‌ గ్రామాల్లో పొలాల అమావాస్య పండగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆవులు, ఎద్దులకు స్నా నాలు చేయించి అందంగా అలంకరించి పూజలు చేసి నైవేద్యాలు తినిపించారు. గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.

Updated Date - Sep 02 , 2024 | 10:46 PM