Share News

పోలీసులు క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Dec 22 , 2024 | 10:26 PM

పోలీసులు క్రీడల్లో రాణించా లని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ అన్నారు. ఆదివారం ఎఎంసీ క్రీడా మైదానంలో సబ్‌ డివిజన్‌ స్థాయి పోలీసుల క్రికెట్‌ పోటీలను నిర్వహిం చారు. ఏసీపీ మాట్లాడుతూ రోజు పోలీసులు విధి నిర్వహణలో భాగంగా ఒత్తిడికి గురవుతారని, క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక ధారుడ్యం పెరుగుతుందన్నారు.

పోలీసులు క్రీడల్లో రాణించాలి

బెల్లంపల్లి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలీసులు క్రీడల్లో రాణించా లని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ అన్నారు. ఆదివారం ఎఎంసీ క్రీడా మైదానంలో సబ్‌ డివిజన్‌ స్థాయి పోలీసుల క్రికెట్‌ పోటీలను నిర్వహిం చారు. ఏసీపీ మాట్లాడుతూ రోజు పోలీసులు విధి నిర్వహణలో భాగంగా ఒత్తిడికి గురవుతారని, క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు శారీరక ధారుడ్యం పెరుగుతుందన్నారు.

ప్రతీ ఒక్కరికి క్రీడలు, వ్యాయామం నిత్య జీవితంలో భాగంగా ఉండాలన్నారు. తాండూర్‌ జట్టు గెలుపొందగా బహుమతులు అందజేశారు. సీఐలు దేవయ్య, అప్జలొద్దీన్‌, కుమారస్వామి, శశిధర్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 10:26 PM