Share News

జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

ABN , Publish Date - Sep 24 , 2024 | 10:56 PM

గిరిజన గ్రామాల్లో జ్వరాలు ప్రబలకుండా నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేప ట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కాసిపేట పీహెచ్‌సీని సందర్శించి వైద్యులు, రోగులకు అం దిస్తున్న సేవలను తెలుసుకున్నారు. జ్వరపీడిత గ్రామాల ను గుర్తించి వైద్య శిబిరాలను నిర్వహించాలని సూచిం చారు.

జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

కాసిపేట, సెప్టెంబరు 24: గిరిజన గ్రామాల్లో జ్వరాలు ప్రబలకుండా నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేప ట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కాసిపేట పీహెచ్‌సీని సందర్శించి వైద్యులు, రోగులకు అం దిస్తున్న సేవలను తెలుసుకున్నారు. జ్వరపీడిత గ్రామాల ను గుర్తించి వైద్య శిబిరాలను నిర్వహించాలని సూచిం చారు. పారిశుధ్య కార్మికులను సమన్వయం చేసుకుం టూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలుం టాయని హెచ్చరించారు. డీఎల్‌పీవో ఎస్‌కె సప్దర్‌ ఆలీ, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, వైద్యాధి కారి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిరూరల్‌: చర్లపల్లి ప్రభుత్వ పాఠశా లను కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న బోధనపై ఉపాధ్యాయులను ఆరా తీశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో రూ. 8 లక్షలతో భవనం నిర్మించేందుకు ప్రతిపాదన పంపాలని అధికారులను ఆదే శించారు. ఎంపీడీవో మహేందర్‌, ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, ఏఈ వినయ్‌ , ఉపాధ్యాయులు ఉన్నారు.

కలెక్టర్‌ ఉపాధ్యాయుడైన వేళ...

కాసిపేట: కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఉపాధ్యాయుడిగా మారారు. మంగళవారం సోనాపూర్‌ గట్రావుపల్లి, నాయకపుగూడ మండల పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలను ఆయన సందర్శించారు. బోర్డుపై రాసిన అక్షరాలను విద్యార్థులతో చదివించి అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

బెల్లంపల్లి: ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌లో అధికారులతో సమావేశం నిర్వ హించారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా శుద్ధమైన నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నూతన పీహెచ్‌సీల ఏర్పాటుకు స్థలాలను గుర్తించి నివేదికలు అందజేయాలన్నారు. ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లి వరకు తాగునీటి ప్రాజెక్టులో భాగంగా నీటి సరఫరా సంబంధిత సర్వే పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఎమ్మె ల్యే వినోద్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీటీ రోడ్డు, సీసీ రోడ్లు, అంతర్గత రహదారుల పూర్తి వివరాలతో నివేదికలు రూపొందించా లని సూచించారు. తాండూర్‌, కాసిపేట రహదారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.

Updated Date - Sep 24 , 2024 | 10:56 PM