Share News

స్ట్రక్చర్‌ సమావేశంలో సమస్యల పరిష్కారం

ABN , Publish Date - Nov 15 , 2024 | 10:41 PM

ఈనెల28న సింగరేణి డైరెక్టర్‌తో జరిగే స్ట్రక్చర్‌ సమావేశంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్రఅధ్యక్షుడు వి సీతా రామయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె రాజ్‌ కుమార్‌ అన్నారు. నస్పూర్‌-శ్రీరాంపూర్‌ ప్రెస్‌క్లబ్‌లో వారిద్దరు విలేకరులతో మాట్లా డారు.

స్ట్రక్చర్‌ సమావేశంలో సమస్యల పరిష్కారం

శ్రీరాంపూర్‌, నవంబరు 15(ఆంధ్ర జ్యోతి): ఈనెల28న సింగరేణి డైరెక్టర్‌తో జరిగే స్ట్రక్చర్‌ సమావేశంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్రఅధ్యక్షుడు వి సీతా రామయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె రాజ్‌ కుమార్‌ అన్నారు. నస్పూర్‌-శ్రీరాంపూర్‌ ప్రెస్‌క్లబ్‌లో వారిద్దరు విలేకరులతో మాట్లా డారు.

11వవేతన ఒప్పందంలో భాగంగా నిర్ణయించిన ప్రకారం ఎన్‌సీడబ్ల్యూఏ ఉద్యోగులకు ఇన్సెంటివ్‌, ఇతర అలవెన్సులు ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు ఉద్యోగులపిల్లలకు ఇస్తున్న స్కాలర్‌షిప్‌ను 20వేల రూపా యల నుంచి 50వేలలకు పెంచాలని తదితర డిమాండ్లు చేస్తామని తెలిపారు. సమావేశంలో ఉపప్రధానకార్యదర్శులు కందికట్ల వీర భద్రయ్య, ముష్కెసమ్మయ్య, బ్రాంచ్‌కార్యదర్శి ఎస్‌కే బాజీసైదా, సహాయ కార్యదర్శి మోత్కూరికొమురయ్య, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 10:41 PM