జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 10:43 PM
గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
నస్పూర్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ అండ్ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ధర్నా అనం తరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌కు అందజేశారు.
గ్రామ పంచాయతీ యూనియన్ (సీఐటీ యు) జిల్లా గౌరవ అధ్యక్షుడు దుంపల రంజిత్‌కుమార్ మాట్లా డుతూ జీవో నంబరు 51ని సవరించి పెండింగ్ వేతనాలు చెల్లిం చాలన్నారు. మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలన్నారు. కార్మికు లపై పని భారం మోపడం, ప్రతీ నెల వేతనాలు చెల్లించాల న్నారు. నాయకులుఅంబటి లక్ష్మన్, రామిళ్ళ రాయలింగు, యూని యన్ జిల్లా కన్వీనర్ చిన్నయ్య, కోకన్వీనర్ సాగర్, నాయకులు రాజలింగు, రాజన్న, సుధాకర్, బానయ్య, బాపు, రవి, దుర్గ, అమ్మాయి. లక్ష్మి, యశోద, లత, మంగ పాల్గొన్నారు.