ధాన్యం కొనుగోలు సమర్ధవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Oct 08 , 2024 | 10:15 PM
ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్‌డీవో కిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఏ రకం ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300లు మద్దతు ధర చెల్లించాలన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 8: ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్‌డీవో కిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మరావుతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఏ రకం ధాన్యానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300లు మద్దతు ధర చెల్లించాలన్నారు.
ధాన్యం కొనుగోలు సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. కేంద్రంలో టార్పాలిన్‌లు, మాయిశ్చర్ మీటర్, ఎలక్ర్టానిక్ వేయింగ్ యంత్రం తప్పనిసరిగా ఉండాలన్నారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా తాగునీరు, నీడ, కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. రైతులు వారి పరిధిలోని వ్యవసాయాధికారుల వద్ద నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని, అప్పుడే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. రైతులు కొన్న ధాన్యానికి నిర్వాహకులు రశీదులు అందించాలని, టాబ్‌లో ఎంట్రీ చేయాలని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.