ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ
ABN , Publish Date - Dec 03 , 2024 | 11:08 PM
ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీలో మంగళవారం అధికారులు, పాఠ శాలల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాయల్ టాకీస్ చౌరస్తా నుంచి సీసీసీ కార్నర్ వరకు ర్యాలీ సాగింది. రోడ్లపై చెత్తను వేయవద్దని, మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని నినాదాలు చేశారు.
నస్పూర్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నస్పూర్ మున్సిపాలిటీలో మంగళవారం అధికారులు, పాఠ శాలల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాయల్ టాకీస్ చౌరస్తా నుంచి సీసీసీ కార్నర్ వరకు ర్యాలీ సాగింది. రోడ్లపై చెత్తను వేయవద్దని, మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. కార్నర్ వద్ద మున్సిపల్ అధికారులు, విద్యార్థులు మానవహారం నిర్వహించారు. తీగల్‌పహడ్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో మున్సి పల్ కార్మికులకు వైద్య పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్స్, మాస్కులు, గ్లౌసులు, సేఫ్టీ జాకెట్స్, బూట్లు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందించారు. మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు, వైస్ చైర్మన్ గెల్లు రజితమల్లేష్, మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్, తహసీల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు రాజమౌళి, పూదరికుమార్, తెనుగు లావణ్యదేవేం దర్, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ సమత, డాక్టర్ రుబియా, మమత, మెప్మా సిబ్బంది, వార్డు ఆఫీసర్లు, పాల్గొన్నారు.
శ్రీరాంపూర్, (ఆంధ్రజ్యోతి): పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు, కమిషనర్ చిట్యాల సతీష్ అన్నారు. శ్రీరాంపూర్‌లోని 6, 16, 17 వార్డులలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు.
బెల్లంపల్లి, (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం పాత మున్సిపల్ కార్యాలయం నుంచి కాంటా చౌరస్తా వరకు 2కే రన్ నిర్వహించారు. ఆర్డీవో హరికృష్ణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కులశ్వేత, కమిషనర్ శ్రీనివాస్, ఎంఈవో పోచయ్య మున్సిపల్, మెప్మా సిబ్బంది, అంగన్‌వాడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.