అకాల వర్షం .. నష్టం
ABN , Publish Date - Nov 01 , 2024 | 11:08 PM
దండేపల్లి మండలంలో గురువారం ఉరుములతో కూడిన కురిసిన అకాల వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. మామిడిపల్లిలో వరి కోత దశలోకి రావడంతో గాలులతో కూడిన వర్షం కురవడంతో వరి పంట నేలవాలింది. వరి గింజలు నల్లబడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు రైతుల వరిపంట కంకి దశలో ఉంది. నేలవాలడంతో నష్టం వాటిల్లింది.
దండేపల్లి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): దండేపల్లి మండలంలో గురువారం ఉరుములతో కూడిన కురిసిన అకాల వర్షంతో రైతులకు నష్టం వాటిల్లింది. మామిడిపల్లిలో వరి కోత దశలోకి రావడంతో గాలులతో కూడిన వర్షం కురవడంతో వరి పంట నేలవాలింది. వరి గింజలు నల్లబడతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు రైతుల వరిపంట కంకి దశలో ఉంది. నేలవాలడంతో నష్టం వాటిల్లింది.
భీమిని, (ఆంధ్రజ్యోతి) : పలు గ్రామాల్లో శుక్రవారం వేకుమజామున నుంచి ఉరుములు, మెరుపులతో వర్షం కురియడంతో భీమిని, ఖర్జిభీంపూర్, చిన్నగుడిపేట, వెంకటాపూర్, రాంపూర్ గ్రామాల్లో వరి పంటలు నేలకొరిగాయి. కొద్ది రోజుల్లో దిగుబడి చేతికి వచ్చే సమయంలో అకాల వర్షం వల్ల ఇబ్బందులు గురవుతున్నామని రైతులు వాపోతున్నారు. నేలకొరిగిన పంటలను పరిశీలించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పంటల పరిశీలన
కాసిపేట, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని వరి పంటలు నేలకొరిగాయి. మల్కేపల్లి, పెద్దనపల్లి, దేవాపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటలను శుక్రవారం మండల వ్యవసాయాధికారి ప్రభాకర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వరి గింజ గట్టిపడే దశలో ఉందని, వర్షం వల్ల పంట నేలకొరగడంతో నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. రైతులు నేలకొరిగిన వరి దుబ్బులను నిలబెట్టి కుచ్చులుగా కట్టుకోవాలని సూచించారు. ఏఈవోలు దీప్తి, రమ్య, రైతులు పాల్గొన్నారు.