Share News

గంజాయికి దూరంగా ఉండండి

ABN , Publish Date - Sep 03 , 2024 | 10:33 PM

గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారు మనసు మార్చు కొని గంజాయికి దూరంగా ఉండాలని, లేదంటే పీడీయాక్టు అమలు చేస్తామని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం పట్టణంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఆనంద నిలయం (వృద్ధులు, అనాథ పిల్లల ఆశ్రమం)లో గంజాయికి అలవాటైన వారితో ఆశ్ర మంలో మొక్కలు నాటించి పరిసరాలను శుభ్రం చేయించారు.

గంజాయికి దూరంగా ఉండండి

మంచిర్యాల అర్బన్‌, సెప్టెంబరు 3: గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారు మనసు మార్చు కొని గంజాయికి దూరంగా ఉండాలని, లేదంటే పీడీయాక్టు అమలు చేస్తామని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం పట్టణంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఆనంద నిలయం (వృద్ధులు, అనాథ పిల్లల ఆశ్రమం)లో గంజాయికి అలవాటైన వారితో ఆశ్ర మంలో మొక్కలు నాటించి పరిసరాలను శుభ్రం చేయించారు. ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్ర మంలో సీపీ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే గంజాయికి బానిసలుగా మారిన యువతను చూస్తే బాధ కల్గుతుందన్నారు. యువతను చెడు వ్యసనాల నుంచి కాపాడేందుకు పోలీస్‌ శాఖ చర్యలు తీసు కుంటుందన్నారు. ఇప్పటికైనా పట్టుబడిన యువ కులు మారాలని, లేదంటే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామన్నారు. గంజాయుని ఎవరైనా రవా ణా చేసినా, విక్రయించినా, సేవించినా కంట్రోల్‌ 87126 56597కు సమాచారం అందిం చాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. వృద్ధులు, పిల్లలకు సీపీ దుప్పట్లను, పం డ్లను పంపిణీ చేశారు. డీసీపీ ఏ.భాస్కర్‌, అడీషనల్‌ డీసీపీ అడ్మిన్‌ సి.రాజు, మంచిర్యాల, బెల్లంపల్లి ఏసీపీలు ఆర్‌.ప్రకాష్‌, రవి కుమార్‌, సీఐలు, ఎస్సైలు, రెడ్‌క్రాస్‌ సొసైటీ సభ్యు లు కె.భాస్కర్‌ రెడ్డి, మహేంధర్‌రెడ్డి, వి.మధుసూ దన్‌ రెడ్డి, కె.సత్యపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 10:33 PM