Share News

అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

ABN , Publish Date - Nov 04 , 2024 | 10:40 PM

కలకత్తాలో ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసిన హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రగతి శీల మహిళ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగ మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులతో బాధితురా లుకు న్యాయం జరగడం లేదన్నారు.

అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కలకత్తాలో ట్రైనీ డాక్టర్‌ను అత్యాచారం చేసిన హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రగతి శీల మహిళ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగ మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కోర్టులతో బాధితురా లుకు న్యాయం జరగడం లేదన్నారు. సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ ఉన్నందున దోషులకు శిక్ష పడేలా చూడాలన్నారు. అరుణ, మంగ, లక్ష్మీ, సుశీల, శ్వేత, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి, (ఆంధ్రజ్యోతి): కలకత్తాలో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రగతి శీల మహిళ సంఘం జిల్లా అధ్యక్షురాలు ముస్కె జ్యోతి అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కాంటా చౌరస్తా వద్ద విద్యార్థినులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. అత్యాచారాలు జరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సంఘం నాయకురాల్లు అనిత, రాజక్క పాల్గొన్నారు.

Updated Date - Nov 04 , 2024 | 10:40 PM