సమాజ సేవలో భాగస్వాములైతేనే గుర్తింపు
ABN , Publish Date - Oct 14 , 2024 | 10:36 PM
మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగులు, యువత సమాజ సేవలో భాగస్వాములైతేనే గుర్తింపు వస్తుందని సంఘం మండల అధ్యక్షకార్యదర్శు బొలిశెట్టి రాజన్న, పోల్లంపల్లి శ్రీనివాస్‌లు కోరారు. మండల కేంద్రంలో సోమవారం మండల మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగుల సంఘ సర్వసభ సమావేశం నిర్వహించారు.
దండేపల్లి, ఆక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగులు, యువత సమాజ సేవలో భాగస్వాములైతేనే గుర్తింపు వస్తుందని సంఘం మండల అధ్యక్షకార్యదర్శు బొలిశెట్టి రాజన్న, పోల్లంపల్లి శ్రీనివాస్‌లు కోరారు. మండల కేంద్రంలో సోమవారం మండల మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగుల సంఘ సర్వసభ సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మున్నూరు కాపు నిరుద్యోగ యువత, విద్యార్ధులకు చేయూత నివ్వాలన్నారు. మావన సేవయేమాధవ సేవ అని తోటి వారికి సహాయం అందించినప్పుడే తృప్తి కలుగుతుందన్నారు.
ఇటీవల పదోన్నతులు పొందిన డిగ్రీ లెక్చరర్ మొరుపుటాల తిరుపతి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ప్రేమ్‌కుమార్, జూనియర్ లెక్చరర్ తోట భీమయ్య, తెలుగు ఉపాధ్యాయుడు బక్కశెట్టి వెంకటేష్, హెడ్ కానిస్టేబుల్ నాసాని రవి, కుంచె గణేష్‌లను సన్మానించారు. జిల్లా కన్వీనర్ బొలిశెట్టి బుచ్చన్న, గౌరవ అధ్యక్షుడు అన్నం సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు అప్పాల మనోహర్, కోండు జనార్దన్, కోశాధికారి కుంచె కిషన్, గుర్రం గంగన్న, గాండ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.