Road Accident: నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..
ABN , Publish Date - May 23 , 2024 | 07:43 AM
నిర్మల్ జిల్లా: మహబూబ్ ఘాట్ వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. అదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 25 మందికి గాయాలుకాగా..
నిర్మల్ జిల్లా: మహబూబ్ ఘాట్ వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రైవేటు బస్సు (Private Bus) అదుపుతప్పి బోల్తాపడింది (overturned). అదిలాబాద్ (Adilabad) నుంచి హైదరాబాద్ (Hyderabad)కు వెళ్తుండగా ఈ ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 25 మందికి గాయాలుకాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును డ్రైవర్ వేగంగా నడపడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు ప్రయాణీకులు చెబుతున్నారు. ఈ బస్సులో సుమారు 50 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాద మాచారంతో సారంగాపూర్ పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్‌లో బస్సు బయలు దేరినప్పటి నుంచి డ్రైవర్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో బస్సును నడిపారని క్షతగాత్రులు చెప్పారు. బస్సు బోల్తా పడగానే డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. కాగా బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆదిలాబాద్ కు చెందిన ఫర్హాన బేగం అనే మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో నిర్మల్ ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కర్నూలు జిల్లాలో ప్రైవేటు బస్సు బోల్తా..
కేంద్రానికి ఆర్బీఐ భారీ గిఫ్ట్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News