భక్తి శ్రద్ధలతో సద్దుల బతుకమ్మ
ABN , Publish Date - Oct 08 , 2024 | 10:12 PM
చెన్నూరు పట్టణంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహి ళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజా మునే తీరొక్క పూలను సేకరించిన మహిళలు బతు కమ్మలను పేర్చి స్ధానిక ఆలయాల్లో బతుకమ్మ ఆడా రు.
చెన్నూరు, అక్టోబరు 8: చెన్నూరు పట్టణంలో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలను మహి ళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేకువజా మునే తీరొక్క పూలను సేకరించిన మహిళలు బతు కమ్మలను పేర్చి స్ధానిక ఆలయాల్లో బతుకమ్మ ఆడా రు. పట్టణంలోని బ్రహ్మణ సంఘం పద్మశాలి, ముది రాజ్ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మం డపాల వద్ద వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం బతుకమ్మలతో శోభా యాత్ర నిర్వహించి పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు. సీఐ రవీందర్, ఎస్‌ఐ శ్వేతలు బందోబస్తు నిర్వహించారు.
బతుకమ్మ ఉత్సవాలకు తరలిరండి
మందమర్రిటౌన్: తెలంగాణ సంస్కృతి సంప్ర దాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండగను ఈ నెల 10న సింగరేణి పాఠశాల మైదానంలో ఘనంగా నిర్వహిస్తామని జీఎం దేవేందర్ తెలి పారు. మంగళవారం సీఈఆర్ క్లబ్‌లో నిర్వహించిన ఫ్యామిలీ డే వేడుకలకు హాజరై మాట్లాడారు. బతుక మ్మ ఉత్సవాల సందర్భంగా ఉత్తమ బతుకమ్మలను ఎంపికచేసి బహుమతులు అందిస్తామన్నారు. కార్మి కుల ఆహ్లాదం సింగరేణి లక్ష్యమన్నారు. ఫ్యామిలీడేకు పెద్ద ఎత్తున మహిళలు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు.
అనంతరం సీఈఆర్ క్లబ్ మైదానంలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఎస్‌వోటూ జీఎం రాజేశ్వర్‌రెడ్డి, పీఎం శ్యాంసుందర్, ఏఐటీ యూసీ నాయకులు సలేంద్ర సత్యనారాయణ, సేవా సమితి అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.