రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
ABN , Publish Date - Oct 01 , 2024 | 10:09 PM
రాష్ట్రస్థాయి కుస్తీ పోటీ లకు అచ్చలాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెం దిన విద్యార్థినులు సీహెచ్ హర్షిత, కె. శ్రీవల్లి, ఈశ్వ రిలు ఎంపికైనట్లు హెచ్‌ఎం ఉమాదేవి, పీడీ సాం బమూర్తిలు తెలిపారు. ఇటీవల లక్షెట్టిపేటలో నిర్వ హించిన ఉమ్మడి ఆదిలాబాద్ జల్లా జోనల్ స్థాయి కుస్తీ పోటీల్లో అండర్17 విభాగంలో హర్షిత, శ్రీవల్లి, అండర్ 14 విభాగంలో ఈశ్వరిలు ఎంపికయ్యార న్నారు.
తాండూర్, అక్టోబరు 1: రాష్ట్రస్థాయి కుస్తీ పోటీ లకు అచ్చలాపూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెం దిన విద్యార్థినులు సీహెచ్ హర్షిత, కె. శ్రీవల్లి, ఈశ్వ రిలు ఎంపికైనట్లు హెచ్‌ఎం ఉమాదేవి, పీడీ సాం బమూర్తిలు తెలిపారు. ఇటీవల లక్షెట్టిపేటలో నిర్వ హించిన ఉమ్మడి ఆదిలాబాద్ జల్లా జోనల్ స్థాయి కుస్తీ పోటీల్లో అండర్17 విభాగంలో హర్షిత, శ్రీవల్లి, అండర్ 14 విభాగంలో ఈశ్వరిలు ఎంపికయ్యార న్నారు. ఈనెల 3 నుంచి 5 వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి కుస్తీ పోటీల్లో పాల్గొంటా రన్నారు. విద్యార్థినులను పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చిలకమ్మ, గ్రామస్థులు, ఉపాధ్యా యులు అభినందించారు.
కాసిపేట: రాష్ట్రస్థాయి అండర్ 14 ఫుట్‌బాల్ పోటీలకు కాసిపేట జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న బానోత్ విష్ణు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు మామిడిపల్లి సాంబమూర్తి తెలిపారు. మందమర్రి మండలం బొక్కలగుట్టలోని హెవన్ ఆఫ్ హోప్ పాఠశాలలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో విష్ణు ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయికి పోటీలకు ఎంపికైన ట్లు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయుడు భుక్య రాజన్న, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ స్వరూప, ఉపాధ్యాయులు అభినందించారు.
జన్నారం: లక్షెట్టిపేటలో జరిగిన జోనల్ స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఇందన్‌పల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు రాజేందర్ తెలిపారు. అండర్ 17లో ఐశ్వర్య, గంగాదేవి, అండర్ 14లో కాజల్, దివ్య, సహస్రలు ఎంపికైనట్లు తెలి పారు. విద్యార్ధులను ఫిజికల్ డైరెక్టర్ తిరుపతి, ఉపాధ్యాయులు అభినందించారు.