యువతకు ఉపాధి కల్పించడానికి స్కిల్ డెవలప్‌మెంట్
ABN , Publish Date - Oct 14 , 2024 | 10:33 PM
కోల్‌బెల్ట్ ప్రాంతంలోని నిరుద్యోగు లకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని మందమర్రి జీఎం దేవేందర్ తెలిపారు. సోమ వారం పట్టణంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో కంప్యూటర్ డీటీపీకోర్సులను ప్రారం భించి మాట్లాడారు.
మందమర్రిటౌన్, అక్టోబరు 14 (ఆంధ్ర జ్యోతి): కోల్‌బెల్ట్ ప్రాంతంలోని నిరుద్యోగు లకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని మందమర్రి జీఎం దేవేందర్ తెలిపారు. సోమ వారం పట్టణంలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో కంప్యూటర్ డీటీపీకోర్సులను ప్రారం భించి మాట్లాడారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం కార్పొరేట్ సోషల్ రెస్సాన్సబులిటీతోపాటు సామాజికబాధ్యతగా ఈ కార్యక్రమాన్ని సింగరేణి చేపట్టిందన్నారు.
శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. రీజనల్‌డైరెక్టర్ ఆఫ్‌స్కిల్‌డెవలప్‌మెంట్ ఎంట్రీప్రినూయరెన్స్ (ఆర్‌డీఎస్‌డీఈ) సంస్థతో ఈశిక్షణ అందిస్తా మన్నారు. కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం రాజేశ్వర్‌రెడ్డి,ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచీ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.