Share News

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ABN , Publish Date - Sep 20 , 2024 | 10:21 PM

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన అందించి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి రిజిష్టర్‌లు, వంటశాల, తర గతి గదులు, పరిసరాలను పరిశీలించారు.

విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

కన్నెపల్లి, సెప్టెంబరు 20: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరో గ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడంతోపాటు నాణ్యమైన విద్యాబోధన అందించి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా కృషి చేయాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను ఆకస్మికంగా సందర్శించి రిజిష్టర్‌లు, వంటశాల, తర గతి గదులు, పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు, విషజ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేసి తాగునీరు, ఆహారం తీసుకునే సమయంలో తప్పనిసరిగా చేతులను శుభ్రపర్చుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కస్తూర్బాగాంధీ విద్యాలయంలో విద్యార్థి నులకు కలెక్టర్‌ స్వయంగా పాఠ్యాంశాలను బోధించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కోసం భూమిని పరిశీలించారు. మండలం లోని టేకులపల్లి ప్రభుత్వ పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాన్ని సంద ర్శించి గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం సకాలంలో అం దించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రిజిష్టర్‌ లను, రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులను ముమ్మరంగా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్‌ వెంట మండల అధికారులు ఉన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 10:21 PM