Share News

దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

ABN , Publish Date - Dec 03 , 2024 | 11:10 PM

దివ్యాంగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్స వంలో భాగంగా దివ్యాంగులను సన్మానిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దివ్యాంగుల పరి రక్షణ హక్కులపై అవగాహన కలిగి ఉం డాలని, ప్రత్యేక కమ్యూనిటీ హాలు ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామన్నారు.

 దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 3 (ఆం ధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమం దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్స వంలో భాగంగా దివ్యాంగులను సన్మానిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ దివ్యాంగుల పరి రక్షణ హక్కులపై అవగాహన కలిగి ఉం డాలని, ప్రత్యేక కమ్యూనిటీ హాలు ఏర్పాటుపై చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగుల సౌకర్యం కోసం ట్రైసైకిళ్లు అందిస్తామన్నారు. జిల్లా సంక్షేమాధికారి స్వరూపరాణి, అధికారు లు దుర్గాప్రసాద్‌, రవీందర్‌రెడ్డి, రాజేశ్వరి, గణపతి, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల మానసిక స్థితిగతులను పర్యవేక్షించాలి

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల మానసిక స్థితి గతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్‌ జిల్లా అధికారి అంజయ్యతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటర్‌ విద్యార్థుల శారీ రక పరిస్థితి, మానసిక ప్రవర్తనలపై పర్యవే క్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో టెలిమానస్‌ ద్వారా మానసిక వైద్య నిపుణులు సునీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఇంటర్‌ విద్యార్థులకు డ్రగ్స్‌ డీ ఆడిక్ట్‌, పరీక్షల సమయంలో ఒత్తిడి, ఆందోళన ఇతర మానసిక సమస్యలపై వైద్య సేవలు అందిస్తామన్నారు. 14416 నెంబర్‌ ద్వారా టెలిమానస్‌ సేవలు పొందవచ్చని, తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల న్నారు. క్రమం తప్పకుండా పేరెంట్స్‌ సమావేశాలు నిర్వహించాలని, విద్యార్థు లపై ఒత్తిడిని నియంత్రించి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలి తాలు సాధించే విధంగా ప్రోత్సహించాలని తెలిపారు. ప్రభు త్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 11:10 PM