Share News

మానవ జీవితంలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం

ABN , Publish Date - Aug 29 , 2024 | 10:16 PM

మానవ జీవితంలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుం దని, క్రీడలతో శారీరకంగా మానసికంగా ధృఢం గా ఉంటారని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్క రించుకుని కలెక్టరేట్‌లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు అదనపు కలెక్టర్‌ మోతి లాల్‌, జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి కీర్తి రాజ్‌వీర్‌లతో కలిసి మెడల్స్‌ ప్రదానం చేశారు.

మానవ జీవితంలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 29: మానవ జీవితంలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుం దని, క్రీడలతో శారీరకంగా మానసికంగా ధృఢం గా ఉంటారని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. గురువారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్క రించుకుని కలెక్టరేట్‌లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు అదనపు కలెక్టర్‌ మోతి లాల్‌, జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి కీర్తి రాజ్‌వీర్‌లతో కలిసి మెడల్స్‌ ప్రదానం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ హాకీ క్రీడాకారుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని జాతీ యక్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు దుర్గప్రసా ద్‌, జెడ్పీ సీఈవో గణపతి నాయక్‌, అధికారులు రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.

చెన్నూరు: పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల మైదానంలో గురుకృప స్పోర్ట్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ధ్యాన్‌చంద్‌ జయంతి నిర్వహించారు. ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. క్రీడా జ్యోతిని వెలిగించి మైదానం నుంచి అంబేద్కర్‌ చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. క్లబ్‌ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

మందమర్రి టౌన్‌: సింగరేణి పాఠశాల ఆవ రణలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని కాంగ్రెస్‌ నాయకులు నిర్వహించారు. జాతీయ క్రీడాకారు డు ఇటీవల అథ్లెటిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన శనిగారపు క్రాంతిని సన్మానించారు. యూత్‌ కాం గ్రెస్‌ రాష్ట్ర కార్యదర్శి మహంత్‌ అర్జున్‌కుమార్‌, సేవాదల్‌ జిల్లా అధ్యక్షుడు పాషా మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంద న్నారు. సురేందర్‌, సాగర్‌, సంపత్‌ పాల్గొన్నారు.

బెల్లంపల్లి: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పుర స్కరించుకుని తిలక్‌ స్టేడియంలో లయన్స్‌క్లబ్‌ సభ్యులు ప్రభుత్వ పాఠశాలల పీడీలు బండి రవి కుమార్‌, ఎస్‌కె రాజ్‌మహ్మద్‌, ఎండీ చాంద్‌ పాషా, పీఈటీ సంతోష్‌ను సన్మానించారు. ఎం ఈవో మహేశ్వర్‌రెడ్డి, లయన్స్‌క్లబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రమేష్‌, రాజన్న, ఆదర్శ్‌వర్ధన్‌రాజు, రాజం, నగేష్‌, నర్సయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.

దండేపల్లి: జాతీయ క్రీడా దినోత్సవం పురస్క రించుకొని వెల్గనూర్‌, గుడిరేవు ప్రధానోపాధ్యా యులు విజయలక్ష్మి, శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు హాకీ మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటా నికి పూలమాల వేశారు. పాఠశాల మైదానంలో కబడ్డీ, ఫుట్‌బాల్‌, ఖోఖో పోటీలను నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు.

మంచిర్యాల అర్బన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. హాకీ మాంత్రికుడు, పద్మభూషన్‌ మేజర్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్‌ చక్రపాణి, వైస్‌ప్రిన్సిపాల్‌ నరేందర్‌రెడ్డి, పాల్గొన్నారు.

కన్నెపల్లి: జిల్లా పరిషత్‌ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుని విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యా యుడు రమేష్‌ ధ్యాన్‌చంద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు.

Updated Date - Aug 29 , 2024 | 10:17 PM