రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Sep 19 , 2024 | 11:38 PM
కుమరంభీం ఆసి ఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన మహి ళపై అత్యాచారయత్నం, దాడికి పాల్పడిన నిందితుడి పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 21న రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చినట్లు ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు తెలిపారు.
కాసిపేట, సెప్టెంబరు 19: కుమరంభీం ఆసి ఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన మహి ళపై అత్యాచారయత్నం, దాడికి పాల్పడిన నిందితుడి పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 21న రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చినట్లు ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు తెలిపారు. గురువా రం దేవాపూర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ జైనూర్‌కు చెందిన ఆదివాసీ గిరిజన మహిళపై సంఘటన జరిగి రెండు నెలలు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం సరైంది కాదన్నారు. బాధితురాలుకు న్యాయం చేయాలని ఆందోళనలు చేసినా ప్రభు త్వం పట్టించుకోవడం లేదన్నారు. నిందితునికి కఠిన శిక్ష వేయాలని ఈ నెల 21న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నామన్నారు. బంద్‌లో ఆదివాసీ గిరిజన, మహిళ సంఘాలు, ప్రజా సంఘాలు, వ్యాపారులు, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరా రు. తుడుందెబ్బ మండల అధ్యక్షుడు భూమన్న, రాయిసెంటర్ ఉపమేడి కుంరం జనార్ధన్, ఆదివాసీ సేవ ఉపాధ్యక్షుడు ప్రభాకర్, శ్రీను, సిడాం శంకర్, సిడాం రాందాస్, రంజిత్ పాల్గొన్నారు.