Share News

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు

ABN , Publish Date - Dec 31 , 2024 | 10:33 PM

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు ఇసుక రీచ్‌ల నుంచి తీయడం జరుగుతుందని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని, చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకొంటామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు ఇసుక రీచ్‌ల నుంచి తీయడం జరుగుతుందని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని, చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈయేడు చింతలపల్లి వే బ్రిడ్జి నుంచి 328 ట్రిప్పుల్లో 1,312 మెట్రిక్‌ టన్నుల ఇసుకను 47వేల468 రూపాయలకు విక్రయించామని, కొల్లూరు వద్ద ఉన్న 3 వేబ్రిడ్జిల నుంచి 78 ట్రిప్పుల్లో సుమారు 2,340 మెట్రిక్‌ టన్నుల ఇసుకను 8లక్షల77వేల500రూపాయలకు విక్రయించామన్నారు. ఒక ట్రిప్పులో దాదాపు 30 మెట్రిక్‌ టన్నుల ఇసుక ఉంటుందని, అంతకుమించి ఉంటే అన్‌లోడింగ్‌ చేస్తామన్నారు. 2024 సంవత్సరంలో 4 కేసులు నమోదు చేసి 2లక్షల12వేల360 రూపాయల జరిమానా రుసుం వసూలు చేశామన్నారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులకు నిబంధనలకు లోబడి ఇసుకను తరలించడం జరుగుతుందన్నారు. అక్రమంగా ఇసుక తరలించినట్లు తెలిస్తే అధికారులకు సమాచారం ఇస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. వార్తా పత్రికలు, న్యూస్‌ చానళ్లలో ఇసుక అక్రమ రవాణాపై వార్తలు వస్తున్నాయని, ఒకసారి ప్రజల్లోకి వెళ్లిన వార్తను తిరిగి తీసుకోలేమని, పాత్రికేయులు బాధ్యతగా వ్యవహరించి ఈ అంశంపై నిజనిర్ధారణ చేసుకుని పూర్తి ఆధారాలతో వార్తలు ప్రచురించాలని, ప్రసారం చేయాలని తెలిపారు. సమావేశంలో పాత్రికేయులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2024 | 10:33 PM